Begin typing your search above and press return to search.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతికి అసలు కారణం ఇదే!

అయితే ఈయనకు సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Aug 2023 7:16 AM GMT
ప్రముఖ ఆర్ట్  డైరెక్టర్  మృతికి అసలు కారణం ఇదే!
X

సినీ ఇండస్ట్రీ వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రకరకాల కారణంగా కన్నుమూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పలువురు హార్ట్ స్టోక్స్ తో కన్నుమూయగా.. మరికొంతమంది యాక్సిడెంట్స్ లో కన్నుమూశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతికి గల కారణాల పై పోలీసులు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

అవును... అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) బుధవారం అకస్మాత్తుగా చనిపోయిన సంగతి తెలిల్సిందే. రాయగడ కర్జాన్ లోని తన స్టూడియోలో విగతజీవిగా కనిపించారు. ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్దారించిన పోలీసులు.. దర్యాప్తు చేశారు. అయితే ఎన్నో అద్భుతమైన సినిమాల కు పనిచేసిన నితిన్ దేశాయ్ ఇలా చనిపోవడానికి కారణమేంటి అనే విషయాల పై ఫైనల్ గా వివరాలు వెలుగు లోకి వస్తున్నాయి!

ఇందులో భాగంగా... బుధవారం తెల్లవారుజామున నితిన్ దేశాయ్ చనిపోయారు. ఉదయం ఈ విషయం బయటపడింది. అయితే ఈయనకు సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల వెబ్‌ సైట్స్‌ లో వచ్చిన కథనాల ప్రకారం ఈ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తొంది.

అయితే 2016లో దేశాయ్, అతని భార్య నైనా వారి సంస్థ కలిపి ఈసీఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రూ.150 కోట్ల రుణాన్ని తీసుకున్నారంట. అనంతరం 2018లో మరో రూ.31 కోట్లు తీసుకున్నారు. దీంతో అప్పు మొత్తం రూ. 181 కోట్లు అయ్యిందని అంటున్నారు.

వాస్తవానికి నితిన్ తీసుకున్న రూ. 181 కోట్ల లోన్ అయినప్పటికీ.. అది కాస్త వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరిందని అంటున్నారు. దీంతో సదరు సంస్థ నితిన్‌ ఎన్‌.డీ. స్టూడియోని సీజ్‌ చేసేందుకు రెడీ అయిపోయిందని తెలుస్తోంది. దీంతో ఈ మొత్తాన్ని కట్టలేక సతమతమయ్యాడట నితిన్. దీంతో బాదలు భరించలేక చివరకు తనువు చాలించాడని అంటున్నారు.

ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈయనది ఆత్మహత్యగా తేల్చారు. ఉరివేసుకుని ప్రాణం వదిలేశాడని ఎస్పీ తెలిపారు

ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్‌ గా 20 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో నితిన్ చంద్రకాంత్ దేశాయ్ పని చేశారు. అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ వంటి ప్రముఖ దర్శకులతో ఆయన పని చేశారు.

కాగా... అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్ సినిమాలకుగానూ నాలుగుసార్లు జాతీయ అవార్డ్స్ సాధించారు నితిన్. ఆస్థాయి వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... స్లమ్‌ డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌ పతి సెట్స్ రూపొందించిన ఘనత కూడా నితిన్ సొంతమే.