Begin typing your search above and press return to search.

గాండీవధారి అర్జున.. టైటిల్ వెనక కథ ఇదే..!

4 కార్బైన్ గన్ పట్టుకున్న హీరో అలా కనిపిస్తాడని అందుకే ఈ సినిమాకు గాండీవధారి అర్జున టైటిల్ పెట్టామని డైరెక్టర్ వివరణ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 7:33 AM GMT
గాండీవధారి అర్జున.. టైటిల్ వెనక కథ ఇదే..!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గాండీవధారి అర్జున సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కినట్టు తెలుస్తుంది. సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గాండీవధారి అర్జున అసలు ఈ టైటిల్ కి అర్థం ఏంటని అందరు డౌట్ పడుతున్నారు.

ఇంద్రుడు వరంగా ఇచ్చిన ధనుస్సుతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేస్తాడు. ఆ ధనుస్సు పేరే గాడీవం. ఆ ఆయుధం పట్టుకున్న టైం లో అర్జునుడు ఎంత భయంకరంగా ఉంటాడో ఈ సినిమాలో ఎం 4 కార్బైన్ గన్ పట్టుకున్న హీరో అలా కనిపిస్తాడని అందుకే ఈ సినిమాకు గాండీవధారి అర్జున టైటిల్ పెట్టామని డైరెక్టర్ వివరణ ఇచ్చారు. ఆల్రెడీ పి.ఎస్.వి గరుడవేగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమాతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.

ఎప్పుడూ కొత్త కథలను చేయడం ఇష్టమని చెబుతున్న వరుణ్ తేజ్ సినిమా హిట్టైనా ఫ్లాపైనా రిజజ్ట్ తో సంబంధం లేకుండా ప్రయత్నాలు చేస్తానని అన్నారు. ప్రవీణ్ సత్తారు కథ చెప్పిన వెంటనే సినిమా చేద్దామని అన్నానని.. సోషల్ ఇష్యూస్ తో ఉన్న ఈ సినిమాలో నటించడం తన బాధ్యతగా ఫీలైనట్టు వరుణ్ తేజ్ అన్నారు. ఫ్యూచర్ జెనరేషన్ కాలుష్య కోర్ల నుంచి కాపాడుకోవాలన్న నేపథ్యం తో ఈ సినిమా తెరకెక్కించారని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే నష్టాల గురించి సినిమాలో చూపించామని అన్నారు.

గాండీవధారి అర్జున స్పై మూవీగా వస్తుందని అందరు అనుకుంటున్నారు కానీ ఇది స్పై మూవీ కాదని సినిమాలో యాక్షన్ సీన్స్ అలా ఉండటం వల్ల స్పై థ్రిల్లర్ గా అనిపించవచ్చు కానీ ఇది స్పై సినిమా కాదని అన్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాలో తానొక బాడీ గార్డ్ గా కనిపిస్తానని.. సెక్యురిటీ ఎక్స్ పర్ట్ అర్జున్ గా తనలో కొత్త కోణాన్ని చూస్తారని అన్నారు వరుణ్ తేజ్. ఈ సినిమా ఎక్కువ భాగం లండన్ లో షూటింగ్ చేశారు. బుడాపెస్ట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ సీన్స్ అన్నీ ఆడియన్స్ కి మంచి థ్రిల్ కలిస్తాయని అన్నారు వరుణ్ తేజ్.

గాండీవధారి అర్జున సినిమాకు సెన్సార్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 16 నిమిషాలతో వస్తుంది. ఇలాంటి సినిమాకు కథ రివీల్ కాకుండా ప్రమోషన్స్ చేయడం కష్టం ఉన్న కంటెంట్ ని ప్రచారం కోసం వాడకూడదని జాగ్రత్త పడ్డామని వరుణ్ తేజ్ అన్నారు. ఈ సినిమా చూసేందుకు 10 కారణాలు ఉన్నాయంటూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. గాండీవధారి అర్జున సినిమాలో లవ్, చేజింగ్స్, క్యారెక్టర్స్, స్టోరీ, యాక్షన్, లొకేషన్స్, ఫైట్స్, గన్స్, ఘర్షణలు, ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. మరి ఇన్ని అంశాలున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీ అవుతుందా లేదా అన్నది చూడాలి.