Begin typing your search above and press return to search.

ఆర్య 2 - సిరిమల్లెచెట్టు.. టాప్ రీ రిలీజ్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉందంటే..

ఇదే సమయంలో మహేష్ బాబు, వెంకటేశ్ నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా మళ్లీ విడుదలై మంచి స్పందనను రాబట్టింది.

By:  Tupaki Desk   |   7 April 2025 3:34 PM IST
ఆర్య 2 - సిరిమల్లెచెట్టు.. టాప్ రీ రిలీజ్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉందంటే..
X

లేటెస్ట్ గా రీ రిలీజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. గతంలో థియేటర్లను షేక్ చేసిన కొన్ని మోస్ట్ లవ్డ్ సినిమాలు ఇప్పుడు మళ్లీ స్క్రీన్ పై సందడి చేస్తూ రికార్డులు సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన 'ఆర్య 2' రీ రిలీజ్ ఫస్ట్ డేనే అద్భుతమైన వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజే రూ. 3.83 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది.

ఇదే సమయంలో మహేష్ బాబు, వెంకటేశ్ నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా మళ్లీ విడుదలై మంచి స్పందనను రాబట్టింది. ఈ సినిమా మళ్లీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు, మహేష్-వెంకీ కాంబినేషన్‌ను మిస్ అయిన వారంతా థియేటర్లకు వెళ్లారు. దాంతో ఈ సినిమా రీ-రిలీజ్ వసూళ్లు రూ. 6.6 కోట్లు దాటినట్టు సమాచారం. ఇది ఈ మూవీకి గర్వించదగిన రీ-రన్ సక్సెస్ అని చెప్పాలి.

ఇక రీ రిలీజ్ లకు బూస్ట్ ఇచ్చిన సినిమాల్లో విజయ్ 'గిల్లీ 4కే' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమిళంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ రీ-రిలీజ్ సినిమాగా నిలిచి రూ. 32.5 కోట్లు దాటి, అన్‌బీటబుల్ రికార్డును క్రియేట్ చేసింది. ఇదే దారిలో పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్ 4కే' కూడా థియేటర్లలో ఆల్ టైం క్రేజ్‌తో రూ. 8.01 కోట్ల వరకు వసూలు చేసింది.

మహేశ్ బాబు - పూరీ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'బిజినెస్ మేన్' కూడా 4కే రీ-రిలీజ్ ద్వారా మరోసారి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసింది. రూ. 5.85 కోట్ల వసూళ్లతో ఇది తన స్థాయిని నిరూపించుకుంది. అదే సమయంలో 'ఖుషి', 'ఆరెంజ్', 'సింహాద్రి' సినిమాలు కూడా ఫ్యాన్స్‌కు పండగగా మారాయి. నిత్యం ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో హంగామా చేశాయి. తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా 'దేవదూతన్', 'స్పడికం' సినిమాలు భారీ కలెక్షన్లను రాబట్టాయి.

ఇందులో విశేషం ఏంటంటే.. ఇవన్నీ కేవలం నో ప్రమోషన్స్, నో స్టార్ల ఇన్‌పుట్‌తో వచ్చిన సినిమాలు కావడం. అలాంటి సినిమాలు కలెక్షన్ల పరంగా ఈ స్థాయిలో రాణించడం చూస్తుంటే రీ-రిలీజ్ ట్రెండ్ ఇకపైనా కొనసాగబోతోందనే అర్థం వస్తోంది.

మొత్తం వసూళ్ల ప్రకారం టాప్ రీ-రిలీజ్ సినిమాల రిపోర్ట్ ఇలా ఉంది:

ఘిల్లీ 4కే – రూ. 32.50 కోట్లు

మురారి 4కే – రూ. 8.90 కోట్లు

గబ్బర్ సింగ్ 4కే – రూ. 8.01 కోట్లు

ఖుషి – రూ. 7.46 కోట్లు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – రూ. 6.60 కోట్లు

బిజినెస్ మేన్ 4కే – రూ. 5.85 కోట్లు

దేవదూతన్ (మలయాళం) – రూ. 5.30 కోట్లు

స్పడికం (మలయాళం) – రూ. 4.90 కోట్లు

ఆరెంజ్ 4కే – రూ. 4.71 కోట్లు (రెండో రీ-రిలీజ్ – రూ. 1.35 కోట్లు) సింహాద్రి 4కే – రూ. 4.60 కోట్లు

సలార్ రీ-రిలీజ్ (2025) – రూ. 4.35 కోట్లు

ఆర్య 2 రీ-రిలీజ్ (2025) – రూ. 3.83 కోట్లు (డే-1)**