Begin typing your search above and press return to search.

గ్లోబ‌ల్ స్టార్‌కి RC16 టీమ్ ప్రామిస్?

నేడు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతూ ఆర్.సి 16 టీమ్ కొత్త పోస్ట‌ర్ ని డిజైన్ చేసింది.

By:  Tupaki Desk   |   27 March 2024 4:49 AM GMT
గ్లోబ‌ల్ స్టార్‌కి RC16 టీమ్ ప్రామిస్?
X

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా `ఉప్పెన` బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RC16. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌. విద్ధి సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవ‌లే హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాల్లో మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌క‌దిగ్గ‌జం శంక‌ర్, లెజెండ్ ఏ.ఆర్.రెహ‌మాన్ స‌హా ప‌లువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు.


నేడు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతూ ఆర్.సి 16 టీమ్ కొత్త పోస్ట‌ర్ ని డిజైన్ చేసింది. ఈ పోస్ట‌ర్ లో చ‌ర‌ణ్ ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. ``మా గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడి పనిచేసే కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పి అభిమానులను గర్వపడేలా చేసేలా ఈ సంవత్సరం మీ కీర్తి కిరీటంలో మరో గీటురాయిగా మార‌నివ్వండి.. #HBD రామ్ చరణ్`` అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు.

ఆస‌క్తిక‌రంగా బ‌ర్త్ డే కోస డిజైన్ చేసిన‌ పోస్ట‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్ లుక్ ని ఎలివేట్ చేస్తూనే, అత‌డు న‌టించిన ల్యాండ్ మార్క్ సినిమాల పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఇటీవ‌ల ఆర్.సి 16 లాంచ్ ఈవెంట్లో చ‌ర‌ణ్ పాల్గొన్న‌ప్పుడు వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ ష‌ర్ట్ కాంబినేష‌న్ ఫార్మ‌ల్ ఫ్యాంట్ తో స్టైలిష్‌ లుక్ లో క‌నిపించారు. అదే ఈవెంట్ నుంచి ఎంపిక చేసుకున్న ఫోటోను ఉప‌యోగించుకుని బ్యాక్ గ్రౌండ్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పోస్ట‌ర్ లో చ‌ర‌ణ్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల పోస్ట‌ర్లు అన్నీ క‌నిపిస్తున్నాయి. మ‌గ‌ధీర‌- ఆర్.ఆర్.ఆర్- ధృవ‌-నాయ‌క్-రంగ‌స్థ‌లం స‌హా ఇత‌ర పోస్ట‌ర్లను ముద్రించారు. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న చ‌ర‌ణ్‌-శంక‌ర్ ల గేమ్ చేంజ‌ర్ పోస్ట‌ర్ ని ఉంచారు.

చూస్తుంటే చ‌ర‌ణ్ కి ఆర్.సి 16 టీమ్ స‌వాల్ విసిరిందా? లేక స‌వాల్ ని స్వీక‌రిస్తున్నామ‌ని చిత్ర‌బృందం అంగీక‌రిస్తోందా? పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ లో ఆర్.సి 16 ని ఆ స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తామ‌ని హామీ ఇస్తున్న‌ట్టా వెయిట్ అండ్ సీ...

చ‌ర‌ణ్ త‌దుప‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోను న‌టిస్తున్నారు. ఇటీవ‌లే అధికారికంగా ఆర్.సి 17 చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి విధిత‌మే.