Begin typing your search above and press return to search.

RC 16: ఇది మరో కొత్త గోల..

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 1:45 PM GMT
RC 16: ఇది మరో కొత్త గోల..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను గత ఏడాది చివరలోనే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ తేజ్ చాలా బిజీగా ఉండడం వలన సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చాల్సి వస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

ఈ ప్రాజెక్టును మరో మూడు నాలుగు నెలలు ఫినిష్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ శంకర్ మరొకవైపు ఇండియన్ ప్రాజెక్టుతో బిజీగా ఉండటం వలన ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బుచ్చిబాబును మరింత వెయిటింగ్ లిస్టులో పెట్టకూడదు అని రామ్ చరణ్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు గేమ్ ఛేంజర్ సినిమాను పూర్తి చేస్తూనే మరొకవైపు బుచ్చిబాబు సినిమాతో కూడా బిజీ అవ్వాలని అనుకుంటూ ఉన్నాడు.

ఇక RC16 సినిమాలో రామ్ చరణ్ తేజ్ పవర్ఫుల్ ఫిట్నెస్ తో బలశాలి గా కనిపించబోతున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఆ మధ్య వినిపించిన టాక్ ప్రకారం బలశాలి కోడి రామమూర్తి బయోపిక్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అని చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక విషయంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

ఇక ఇప్పుడు అది నిజం కాదు అని మరొక కొత్త కొత్త టాక్ అయితే వైరల్ గా మారుతుంది. పూర్తిస్థాయిలో విలేజ్ ఎమోషనల్ డ్రామాగా సినిమా ఉండబోతుందట అంతేకాకుండా బ్యాక్ డ్రాప్ లో క్రికెట్ నేపథ్యం కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. 1980 కాలానికి తగ్గట్టుగా దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ లుక్ విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చారని సమాచారం.

ఈ ప్రాజెక్టు కోసం రామ్ చరణ్ ఏడాది పాటు డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమాను విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.