Begin typing your search above and press return to search.

RC 16.. చరణ్ మైండ్ బ్లాక్ రెమ్యునరేషన్..!

ఇక ఇప్పుడు బుచ్చి బాబు సినిమాకు మరో 20 కోట్లు అంటే మొత్తం 70 నుంచి 80 కోట్ల దాకా రాం చరణ్ రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   2 March 2024 1:30 AM GMT
RC 16.. చరణ్ మైండ్ బ్లాక్ రెమ్యునరేషన్..!
X

శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండానే తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆర్సీ 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీని బుచ్చి బాబు డైరెక్ట్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. తొలి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు తన సెకండ్ సినిమా అసలైతే ఎన్.టి.ఆర్ తో చేయాలని అనుకున్నాడు.

తారక్ తో సినిమా కొన్ని కారణాల వల్ల మిస్ అవ్వగా వెంటనే చరణ్ తో సినిమా లాక్ చేసుకున్నాడు బుచ్చి బాబు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను చరణ్ కి కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట మైత్రి నిర్మాతలు. RRR తో గ్లోబల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ ప్రతి సినిమాకు 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.

అయితే గేమ్ చేంజర్ సినిమాకు మరో 10 కోట్ల దాకా పారితోషికం పెంచాడని టాక్. ఇక ఇప్పుడు బుచ్చి బాబు సినిమాకు మరో 20 కోట్లు అంటే మొత్తం 70 నుంచి 80 కోట్ల దాకా రాం చరణ్ రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడని తెలుస్తుంది. స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయంలో కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిన వారికి అంత ఇచ్చేది ఎందుకో వారు చేస్తున్న కష్టం.. సినిమాకు వారి వల్ల జరిగే బిజినెస్ లెక్కలు చూస్తే అర్ధమవుతుంది.

15 సినిమాలతోనే గ్లోబల్ రేంజ్ సెన్సేషన్ గా మారిన చరణ్ తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి డబుల్ హార్డ్ వర్క్ చేస్తాడు.. సినిమాకు డబుల్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తాడు. గేమ్ చేంజర్ రిలీజ్ అనంతరం బుచ్చి బాబు సినిమాకు పనిచేయనున్నాడు చరణ్. RC16 సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుకుమార్ తో చేసిన రంగస్థలం సినిమా టైం లో చరణ్ తో పని చేసిన వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్న బుచ్చి బాబు RC 16 ని నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించే ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.