Begin typing your search above and press return to search.

RC 16: పర్ఫెక్ట్ పాన్ ఇండియా ప్లాన్

భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించబోతోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:03 AM GMT
RC 16: పర్ఫెక్ట్ పాన్ ఇండియా ప్లాన్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత నెక్స్ట్ సినిమాని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. RC 16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్న బుచ్చిబాబు రామ్ చరణ్ ని సింగిల్ సిట్టింగ్ తోనే మెప్పించాడు. ఉప్పెన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని బుచ్చిబాబు ఈ మూవీ చేయబోతున్నాడు.

భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించబోతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో రామ్ చరణ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందంట. చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ కోసం స్ట్రాంగ్ క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ప్రస్తుతం బుచ్చిబాబు ఉన్నారంట. సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారంట.

ఇప్పటికే బుచ్చిబాబు ఉప్పెన సినిమాలో కూడా విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. తన రెండో సినిమాకి కూడా అతనినే రిపీట్ చేయాలని బుచ్చిబాబు అనుకుంటున్నారంట. హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దించాలని అనుకుంటున్నారంట. జాన్వీ కపూర్ పేరు మొన్నటి వరకు వినిపించిన అంతకంటే ఫేమ్ ఉన్న యాక్టర్ ని ట్రై చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

మిగిలిన పాత్రల కోసం కూడా పాన్ ఇండియా క్యాస్టింగ్ పైన బుచ్చిబాబు ఫోకస్ చేసారంట. సినిమాకి భారీ లెవల్ లో హైప్ తీసుకొచ్చే విధంగా ప్లానింగ్ చేస్తుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రామ్ చరణ్ ఇంకా డేట్స్ అయితే కేటాయించలేదు. ప్రస్తుతం చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత గ్యాప్ చూసుకొని RC 16 సెట్స్ పైకి తీకుకొని వెళ్లనున్నారు.

అన్ని అనుకూలంగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు రామ్ చరణ్ కి RC 16 తో ఎలాంటి హిట్ ఇస్తాడనేది వేచి చూడాలి.