Begin typing your search above and press return to search.

RC 16: బుచ్చిబాబు అప్పుడే రాగాలు మొదలెట్టాడు

అయితే దర్శకుడు మాత్రం సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేసాడు. మైత్రి మూవీ మేకర్స్ అందుకోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా నిర్మించడం విశేషం.

By:  Tupaki Desk   |   30 Sep 2023 3:45 AM GMT
RC 16: బుచ్చిబాబు అప్పుడే రాగాలు మొదలెట్టాడు
X

టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ రెండవ సినిమాను తొందరగా సెట్స్ పైకి తీసుకురాలేకపోయాడు. మధ్యలో అతనికి ప్రముఖ హీరోల నుంచి అలాగే ప్రొడక్షన్ హౌస్ ల నుంచి చాలా కాల్స్ వచ్చాయి. కానీ బుచ్చిబాబు మాత్రం చేస్తే బిగ్ బడ్జెట్లో పాన్ ఇండియా సినిమానే చేయాలి అని కంకణం కట్టుకున్నాడు.

మొదట ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నప్పటికీ సెట్ కాలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా రాంచరణ్ తో RC16 ప్రాజెక్టును మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి చాలా సమయమే ఉంది. అయితే దర్శకుడు మాత్రం సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేసాడు. మైత్రి మూవీ మేకర్స్ అందుకోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా నిర్మించడం విశేషం.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ కూడా ముందే స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రెహమాన్ కోసం దర్శకుడు బుచ్చిబాబు మొదటి నుంచి కూడా గట్టిగానే పట్టుపట్టాడు. దీంతో నిర్మాతలు ఆయనకు అడిగినంత హై లెవెల్లో పారితోషికమిచ్చి మరి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక రెహమాన్ ఎప్పుడు బిజీ అవుతాడో తెలియదు కాబట్టి ముందుగానే దర్శకుడు కొన్ని ట్యూన్స్ సిద్ధం చేయించేందుకు సిద్ధమయ్యాడు.

షూటింగ్ మొదలుపెడితే బుచ్చిబాబు కూడా మళ్ళీ బిజీ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే వీలైనంతవరకు మేజర్ సాంగ్స్ కు సంబంధించిన వర్క్ కంప్లీట్ జరగాలి అని అనుకుంటున్నారు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా దర్శకుడు రెహమాన్ తో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.

రెహమాన్ చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమా చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఏర్పడ్డాయి. రెగ్యులర్ షూట్ నవంబర్ లేదా డిసెంబర్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక 2025 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.