Begin typing your search above and press return to search.

'గేమ్‌ చేంజర్' తెలియదు.. బుచ్చిబాబు ఫిక్స్‌

శంకర్ గేమ్‌ చేంజర్ సినిమాతో పాటు సమాంతరంగా ఇండియన్ 2 సినిమాను కూడా చేస్తున్న కారణంగా ఆలస్యం అవుతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   4 April 2024 9:44 AM GMT
గేమ్‌ చేంజర్ తెలియదు.. బుచ్చిబాబు ఫిక్స్‌
X

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికి కూడా గేమ్‌ చేంజర్ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో క్లారిటీ లేకుండా ఉంది.

శంకర్ గేమ్‌ చేంజర్ సినిమాతో పాటు సమాంతరంగా ఇండియన్ 2 సినిమాను కూడా చేస్తున్న కారణంగా ఆలస్యం అవుతున్న విషయం తెల్సిందే. ఒక వైపు గేమ్‌ చేంజర్ సినిమా విడుదల విషయంలో క్లారిటీ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ గందరగోళానికి గురి అవుతుంటే మరో వైపు బుచ్చిబాబు తన సినిమా విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ హీరోగా రూపొందబోతున్న ఆర్‌సీ16 సినిమా షూటింగ్‌ జులై నుంచి ప్రారంభం అవ్వబోతుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభం లో షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆర్‌సీ16 సినిమా కచ్చితంగా 2025 సమ్మర్ లో విడుదల అవ్వబోతుంది.

శంకర్ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తే మూడు నాలుగు నెలల గ్యాప్ లోనే బుచ్చిబాబు తాను తీయబోతున్న చరణ్ మూవీని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చరణ్‌, బుచ్చిబాబు సినిమా విషయంలో ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ సినిమాలో రామ్‌ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిచబోతుంది. అందమైన పల్లెటూరు అమ్మాయిగా జాన్వీ కనిపించబోతుందట. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర ఉంటుందని, ఆ పాత్ర కోసం బాలీవుడ్‌ కి చెందిన ప్రముఖ హీరోయిన్ తో చర్చలు జరిపారు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.