Begin typing your search above and press return to search.

#RC16 : మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 7:45 AM GMT
#RC16 : మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌
X

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఒక వైపు గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తూనే మరో వైపు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ సినిమా మరి కొన్ని రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గేమ్‌ చేంజర్ షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే బుచ్చిబాబుతో చరణ్ సినిమా షురూ అవ్వబోతుంది. ఏడాది కాలంగా రామ్‌ చరణ్‌, బుచ్చి బాబు కాంబోలో రూపొందబోతున్న #RC16 సినిమా గురించి పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే విధంగా విభిన్నమైన జోనర్‌ లో ఈ సినిమాను బుచ్చి బాబు రూపొందిస్తున్నాడు.

హీరోయిన్‌ విషయం మొదలుకుని కథ వరకు ఎన్నో విషయాల గురించి సోషల్‌ మీడియాలో సందడి వాతావరణం నెలకొంటూనే ఉంది. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఈ విషయం గురించిన వార్తలు వచ్చాయి కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా వస్తున్నాయి.

శ్రీకాకుళంకు చెందిన బాహుబలుడు కోడి రామమూర్తి జీవిత కథాంశంను తీసుకుని కాస్త డ్రామా, కాస్త కల్పన జోడించి బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్‌ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా బయోపిక్‌ కాకుండా కొన్ని వాస్తవిక సంఘటనలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఇండియన్‌ హెర్క్యులస్ అంటూ విదేశీయులు అప్పట్లో కోడి రామమూర్తిని పిలిచేవారు. కానీ ఇండియన్‌ ప్రభుత్వం మాత్రం ఎలాంటి గుర్తింపును ఇవ్వలేదు. అలాంటి కోడి రామమూర్తికి ఇప్పుడు రామ్‌ చరణ్ సినిమా చేయడం ద్వారా గుర్తింపు గౌరవం దక్కినట్లు అవుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ను ఎంపిక చేయాలి అనుకుంటున్నట్లుగా మొదటి నుంచి ప్రచారం జరిగింది. తాజాగా దేవర బ్యూటీ జాన్వీ కపూర్ ను రామ్‌ చరణ్‌ కి జోడీగా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఈ సినిమా విడుదల చేసే యోచనలో ఉన్నారట.