బ్రేక్‌లో ఆర్సీ16 టైటిల్‌ను ఫిక్స్ చేసేస్తారా?
అయితే ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ తీసుకున్న ఆర్సీ16 టీమ్ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉందట.
By: Tupaki Desk | 17 Feb 2025 11:00 PM ISTగేమ్ ఛేంజర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. చరణ్ కెరీర్లో 16వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రీసెంట్ గా చిత్ర యూనిట్ కాస్త గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ మొదలు కానుంది.
గేమ్ ఛేంజర్ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిన రామ్ చరణ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆర్సీ16 విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా సినిమాలో ఎంతో కీలకమైన నైట్ షెడ్యూల్స్ ను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. ఆర్సీ 16 షూటింగ్ ను ఎలాగైనా ఆగస్ట్ లోపు పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
అయితే ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ తీసుకున్న ఆర్సీ16 టీమ్ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉందట. సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసి మార్చిలో చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు ఫలానా టైటిల్ ఫిక్స్ అయిందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ మేకర్స్ ఇంకా ఆర్సీ 16కు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేయలేదని, కేవలం కొన్ని టైటిల్స్ ను మాత్రమే పరిశీలిస్తున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీంతో ఇప్పటివరకు ఆర్సీ16 టైటిల్ విషయంలో వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. రామ్ చరణ్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నాడని సమాచారం.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఆస్కార్ విజేత రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆర్సీ 16ను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
