Begin typing your search above and press return to search.

సింగిల్ సిట్టింగ్ లో తేల్చేసిన మాస్ రాజా

తాజాగా మాస్ మహారాజ్ రైటర్ ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. సామజవరగమన సినిమాతో రైటర్ గా ప్రూవ్ చేసుకున్న భాను భోగపరపు దర్శకత్వంలో రవితేజ మూవీని ఎనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   11 April 2024 5:26 AM GMT
సింగిల్ సిట్టింగ్ లో తేల్చేసిన మాస్ రాజా
X

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే స్పీడ్ గా సినిమాలు చేస్తోన్న నటుడిగా ఉన్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కొత్త కథలతో తనని తాను రిప్రజెంట్ చేసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. రవితేజ సినిమాల ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన దర్శకులు చాలా మంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా ఉన్నారు.

100 కోట్ల సక్సెస్ చూసినా కూడా కొత్తతరం దర్శకుల కథలకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండటం విశేషం. చాలా మంది యువ దర్శకులు రవితేజతో మూవీస్ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మాస్ మహారాజ్ రైటర్ ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. సామజవరగమన సినిమాతో రైటర్ గా ప్రూవ్ చేసుకున్న భాను భోగపరపు దర్శకత్వంలో రవితేజ మూవీని ఎనౌన్స్ చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లలో ఈ మూవీ తెరకెక్కనుంది. RT75 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ఉగాది రోజున ప్రకటించడం విశేషం. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ స్టోరీని రవితేజ సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేసారంట. మాస్ రాజా ఏ కథ విన్న కూడా రెండు, మూడు సార్లు దానిపై చర్చలు జరిపిన తర్వాత ఒకే చెబుతూ ఉంటారు.

అయితే భాను భోగపరపు చెప్పిన స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. అలాగే మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పక్కన పెట్టి ముందుగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే పనిలో రవితేజ ఉన్నారంట. హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే RT75 సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా క్యాస్టింగ్ పై కూడా స్పష్టత రాబోతోందని టాక్.

రవితేజ అంటే అందరికి గుర్తుకొచ్చేది కామెడీ. ఈ మధ్యకాలంలో అతని సినిమాలలో యాక్షన్ ఎక్కువై కామెడీ తగ్గిపోయింది. అయితే RT75 సినిమా మరోసారి వింటేజ్ రవితేజని పరిచయం చేస్తుందంట. మరి ఈ మూవీ మాస్ మహారాజ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రవితేజకి సీరియస్, యాక్షన్ కథలతో ఆశించిన సక్సెస్ లు రావడం లేదు. చివరిగా వచ్చిన ఈగల్ మూవీ డిజాస్టర్ అయ్యింది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో రాబోయే ఈ మూవీ ఆయనకి సూపర్ సక్సెస్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.