Begin typing your search above and press return to search.

'టైగర్' ను ఏ శక్తులు ఆపలేవు.. అనుకున్న రోజే వేట ప్రారంభం

అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 12:20 PM GMT
టైగర్ ను ఏ శక్తులు ఆపలేవు.. అనుకున్న రోజే వేట ప్రారంభం
X

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా రానున్న ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.





అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అక్టోబర్ దసరా బరిలో విజయ్ దళపతి 'లియో', బాలకృష్ణ 'భగవంత్ కేసరి' కూడా రిలీజ్ కు రెడీ అయ్యాయి. దీంతో 'టైగర్ నాగేశ్వరరావు' రావడం లేదని చాలా కథనాలు వచ్చాయి. దీంతో అందరూ నిజమే అనుకున్నారు.

కానీ ఇప్పుడా వార్తలపై మూవీటీమ్ స్పందించింది. వాటిని ఖండించింది. అవన్నీ అవాస్తమని, అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఓ పోస్టర్ తో పాటు ప్రకటనను కూడా విడుదల చేసింది. తమను ఆపేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. కానీ టైగర్ ముందుగా చెప్పనట్టుగానే అక్టోబర్ 20 నుంచి వేట ప్రారంభిస్తుందని తెలిపింది.

"టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కావడం లేదని కొన్ని నిరాధారమైన ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అందులో ఎటువంటి నిజం లేదు. అంతా అబద్ధం. కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నాయి. మా సినిమాకు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపింది.

థియేట్రికల్ ఎకోసిస్టమ్‌లోని కొంతమంది వాటాదారులు మా సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇలాంటి అవాస్తవాలను సృష్టిస్తున్నారు. దయచేసి నమ్మకండి. మీ అందరికీ గొప్ప సినిమా అనుభూతి ఇవ్వడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఈ టైగర్ అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ వేట ప్రారంభిస్తుంది" అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే ఈ సినిమాలో రవితేజతో పాటు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. సీనియర్ నటి రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.