Begin typing your search above and press return to search.

'ఈగల్' తో మరోసారి రిస్క్ చేస్తున్న రవితేజ?

టైగర్ నాగేశ్వర్ రావు తర్వాత 'ఈగల్' అనే డిఫరెంట్ జానెర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 2:30 AM GMT
ఈగల్ తో మరోసారి రిస్క్ చేస్తున్న రవితేజ?
X

మాస్ మహారాజా రవితేజ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది దసరాకి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. టైగర్ నాగేశ్వర్ రావు తర్వాత 'ఈగల్' అనే డిఫరెంట్ జానెర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సంక్రాంతికే 'ఈగల్' రిలీజ్ కావాల్సింది.

కానీ సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉండడంతో దిల్ రాజు తో పాటు నిర్మాతలు చర్చించి సినిమాను సంక్రాంతి రేస్ నుంచి తప్పించారు. పొంగల్ రేస్ నుంచి తప్పుకున్న ఈగల్ ఫిబ్రవరి 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. హిందీలో 'సహదేవ్' అనే పేరుతో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా హిందీలో టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

రవితేజకి హిందీలో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన చాలా తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యి మిలియన్ల కొద్దీ కొద్ది వ్యూస్ అందుకున్నాయి. దాంతో బాలీవుడ్ ఆడియన్స్ కి రవితేజ మరింత దగ్గర అయ్యాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ నార్త్ ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చేశారు.

అయినా కూడా సినిమా కమర్షియల్ గా అక్కడ సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఈగల్ తో మరోసారి రిస్క్ చేసేందుకు రెడీ అయ్యారు.రవితేజ నటించిన ఖిలాడి, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు హిందీలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయినా కూడా ఇంకా రవితేజకి హిందీ మార్కెట్ పై మోజు తీరలేదు.

అందుకే ఈగల్ మూవీ ని 'సహదేవ్' పేరుతో హిందీలో రిలీజ్ చేయిస్తున్నాడు. ఫిబ్రవరి 9న తెలుగు తో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈసారి ఈగల్ హిందీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.