Begin typing your search above and press return to search.

టైగర్ తో రవితేజ రికార్డ్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే..

ఓవరాల్ గా ప్రపంచం వ్యాప్తంగా ఈ చిత్రం 37.50 కోట్ల బిజినెస్ జరిగింది. రవితేజ కెరియర్ లోనే పెద్ద మొత్తం అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   18 Oct 2023 4:19 AM GMT
టైగర్ తో రవితేజ రికార్డ్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే..
X

మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో అక్టోబర్ 20న థియేటర్స్ లోకి రాబోతున్నాడు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది. రవితేజ ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ రావణాసుర మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు.

ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో బయోపిక్ హీరోగా రియల్ స్టొరీతో రాబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. టైగర్ నాగేశ్వరరావు పాత్రకి ఉన్న క్రేజ్ కూడా సినిమాకి హైప్ రావడానికి కారణం అని చెప్పొచ్చు. ఈ పాత్రని రావితేజ పోషించడం వలన కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మూవీలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

రేణు దేశాయ్ కథని మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఈ చిత్రంపై భారీ బిజినెస్ జరిగింది. రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ అయిన మూవీగా టైగర్ నాగేశ్వరరావు ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రపంచం వ్యాప్తంగా ఈ చిత్రం 37.50 కోట్ల బిజినెస్ జరిగింది. రవితేజ కెరియర్ లోనే పెద్ద మొత్తం అని చెప్పాలి.

నైజాంలో 8.60 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయి. ఆంధ్రాలో 17 కోట్లకి డీల్ క్లోజ్ అయ్యింది. సీడెడ్ లో 5.40 కోట్లకి సెట్ అయ్యింది. ఓవర్సీస్ లో 3 కోట్లకి రైట్స్ కొనుగోలు చేశారు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ లెక్కలు చూసుకుంటే మొత్తం 37.50 కోట్లకి తేలింది. 38.50 కోట్ల బ్రేక్ ఎవెన్ తో ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది.

మరి భారీ టార్గెట్ తో అక్టోబర్ 20న థియేటర్స్ లోకి రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ప్రేక్షకులు ఏ మేరకు బ్రహ్మరథం పడతారు అనేది చూడాలి. లియో, భగవంత్ కేసరి చిత్రాలు ఒక రోజు ముందుగానే రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండింటి సక్సెస్ బట్టి టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్స్ దొరుకుతాయి.