Begin typing your search above and press return to search.

మళ్లీ ఆ కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

ఆ సినిమా తర్వాత దాదాపు 12 ఏళ్లుగా పూరీ రవితేజ కలిసి సినిమా చేయలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా పై ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 8:30 AM GMT
మళ్లీ ఆ కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

అంతకుముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన రవితేజలో అసలు మ్యాటర్ చాలా ఉందని కనిపెట్టిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తీశాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి. ఇక మరోసారి ఇద్దరు కలిసి ఇడియట్ తీశారు. అది సూపర్ హిట్ అయ్యింది. అదే ఊపు మీద అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా చేశారు. మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్లతో రవితేజ పూరీ కాంబినేషన్ అంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేశారు.

ఇక ఆఫ్టర్ లాంగ్ టైం దేవుడు చేసిన మనుషులు సినిమా చేశారు. అయితే ఆ సినిమా అంతగా వర్క్ అవుట్ అవ్వలేడు. ఆ సినిమా తర్వాత దాదాపు 12 ఏళ్లుగా పూరీ రవితేజ కలిసి సినిమా చేయలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా పై ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రవితేజ ఓ పక్క వరుస సినిమాలు చేస్తుండగా పూరీ మాత్రం తనకు ఛాన్స్ ఇచ్చే హీరోలను వెతుక్కుంటున్నాడు.

లైగర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న పూరి ఆ సినిమా తర్వాత కుదిరితే రవితేజతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అదే నిజమైతే మాత్రం ఆడియన్స్ కు పండుగ అన్నట్టే. పూరీ రవితేజ ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే మరో సూపర్ హిట్ సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ కాంబో కుదురుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రవితేజ వరుస సినిమాలు చేస్తున్నా ఫలితాలు నిరాశ పరుస్తున్నాయి. అయితే ఈ టైం లో పూరీకి రవితేజ అవకాశం ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

పూరీ హీరోల లిస్ట్ లో రవితేజతో పాటుగా బాలకృష్ణ కూడా ఉన్నాడని తెలుస్తుంది. బాలయ్యతో పైసా వసూల్ చేసిన పూరీ మరోసారి బాలకృష్ణని డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీకి ఏ హీరో అవకాశం ఇస్తాడన్నది చూడాలి. రవితేజతో అయితే మాత్రం మాస్ రాజా ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ముఖ్యంగా ఆ సూపర్ హిట్ కాంబో మరోసారి కలిసి పనిచేస్తే చూడాలని ప్రేక్షకులు కోరుతున్నారు. సూపర్ హిట్ కాంబో కలిస్తే అది మాక్సిమం సూపర్ హిట్ అవుతుందని ఆడియన్స్ ఆలోచన. అలా రవితేజ పూరీ కాంబో సినిమా వచ్చి అదరగొట్టేయాలని అనుకుంటున్నారు. అయితే 12 గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు.