Begin typing your search above and press return to search.

ఈగల్ ఎక్స్ పెక్ట్ చేయరు.. రియాక్షన్ కోసం వెయిటింగ్ అంటున్న రవితేజ..!

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ లో ఎప్పటిలానే మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:03 AM GMT
ఈగల్ ఎక్స్ పెక్ట్ చేయరు.. రియాక్షన్ కోసం వెయిటింగ్ అంటున్న రవితేజ..!
X

రవితేజ లీడ్ రోల్ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈగల్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ లో ఎప్పటిలానే మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను చేసిన యాక్టర్స్ అంతా తనకు కొత్త.. నవదీప్ కి ఎప్పటి నుంచో ఒక సాలిడ్ సినిమా పడాలని అనుకుంటున్నా అది ఇదే అవుతుంది. ఈ సినిమాలో అతని డైలాగ్స్ చాలా బాగా ఉంటాయి. అది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు.. అతనిలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. వెటకారం కూడా విపరీతంగా ఉంటుంది. నవదీప్ తో కలిసి ఒక కామెడీ సినిమా చేస్తానని అన్నారు రవితేజ. మిగతా వారంతా కూడా బాగా చేశారని అన్నారు.

ఈగల్ సినిమా చాలా బాగా వచ్చింది. నేను మీ రియాక్షన్ చూసేందుకు వెయిట్ చేస్తున్నా.. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే మిక్సింగ్ తర్వాత సినిమా చూడలేదు. కార్తీక్ ఏదో మ్యాజిక్ చేశాడనే అనిపిస్తుందని అన్నారు.

హీరో ఆఫ్ ద ఎవెనింగ్ దేవజాండ్.. రాక్ స్టార్.. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది చూసి చెప్తా అన్నారు. ఈ సినిమా తర్వాత బిజీ అవ్వాలి.. సినిమాలో నటించిన ధృవన్ క్యారెక్టర్ కి చిన్న పిల్లలు బాగా కనెక్ట్ అవుతారని అన్నారు రవితేజ.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకొక హోం ప్రొడక్షన్ లాంటిది. ఈ బ్యానర్ లో వరుసగా ఎన్నైనా రెడీ అన్నారు. విశ్వ ప్రసాద్ గారు ఉన్నదున్నట్టు మాట్లాడతారు. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. నేను చాలా క్లియర్ గా ఉంటాను కాబట్టి అది నాకు నచ్చుతుంది. వాళ్లతో ఇంకా డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకుంటున్నా. వాళ్లకు కూడా ఆల్ ది బెస్ట్. సినిమాలో మణి డైలాగ్స్ చాలా బాగా రాశాడు. నేను చాలాసార్లు చెప్పా సినిమా విని ఆడియన్స్ చెప్పాలని అన్నారు రవితేజ.

ఈ కథ నడిపించేదే అనుపమ క్యారెక్టర్.. ఇంకో ఫోర్ డేస్ ఆగండి మీకే క్లారిటీ వస్తుంది. కావ్య కూడా లవ్లీ క్యారెక్టర్ చేసింది. వీళ్లకు కూడా ఆల్ ది బెస్ట్.

కార్తీక్ ఘట్టమనేని.. స్పీచ్ స్పీచ్ కి అతను డెవలప్ అవుతున్నాడు. సినిమా సక్సెస్ అయ్యి అతనికి చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా తన జాబ్ చాలా ఎక్స్ ట్రాడినరీగా చేశాడు. తనకు విపరీతమైన క్లారిటీ ఉంది.. అది నాకు బాగా నచ్చింది. ఐ విష్ హిం ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకు డెఫినెట్ గా సక్సెస్ మీట్ ఉంటుంది. ఆ సక్సెస్ మీట్ లో ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా అని అన్నారు రవితేజ.

సినిమాలో నా గెటప్ కోసం చాలా కష్టపడ్డాం.. కార్తీక్ ఎలా అయితే ఫస్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నా అన్నారు.