Begin typing your search above and press return to search.

రవితేజ.. మరోసారి పవర్ఫుల్ మాస్ కంటెంట్

మాస్ మహారాజ రవితేజ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కూడా అందులో కథనం చాలా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 3:30 PM GMT
రవితేజ.. మరోసారి పవర్ఫుల్ మాస్ కంటెంట్
X

మాస్ మహారాజ రవితేజ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కూడా అందులో కథనం చాలా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ధమాకా సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ చూసినా రవితేజ ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అనుకున్నాడు. ఈ సినిమా కూడా మేకింగ్ పరంగా చాలా కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అంతేకాకుండా స్టువర్టుపురం గజదొంగగా రవితేజ నటించిన విధానం కూడా ఆడియన్స్ కు చాలా బాగా నచ్చింది. అయితే తదుపరి సినిమాల విషయంలో కూడా రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఈగల్ సినిమా రాబోతున్న విషయం తెలిసింది. ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ డ్రాప్ లో రాబోతోంది. సంక్రాంతి టైంలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.

ఇక మరోవైపు రవితేజకు హిట్ కాంబినేషన్ గా వస్తున్న గోపీచంద్ మలినేని తో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వీరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన డాన్ శ్రీను బలుపు క్రాక్ మూడు సినిమాలు కూడా సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఒక మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు.

ఆ సినిమా కంప్లీట్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట. ఇక రవితేజ కూడా రాయలసీమ ఫ్లేవర్ కు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీని కూడా ఈ సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ మాండలికం పర్ఫెక్ట్ గా ఉండేలా అతను ప్రత్యేకంగా రచయితలతో కొన్ని రోజులపాటు శిక్షణ తీసుకోబోతున్నడట.

ఈ సినిమాలో డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగానే దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడట. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్స్ త్వరలోనే స్టార్ట్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను వచ్చే ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.