Begin typing your search above and press return to search.

'మిస్టర్‌ బచ్చన్‌' సూపర్ రూమర్‌.. హిట్ గ్యారెంటీ

పవన్‌ కళ్యాణ్ తో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాను మొదలు పెట్టిన హరీష్ శంకర్‌ ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కకు పెట్టాడు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:40 AM GMT
మిస్టర్‌ బచ్చన్‌ సూపర్ రూమర్‌.. హిట్ గ్యారెంటీ
X

రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా ను ప్రకటించడం, పోస్టర్ వదలడం, టైటిల్‌ ను అనౌన్స్ చేయడం, షూటింగ్ కార్యక్రమాలు షురూ చేయడం అన్ని కూడా చకచకా జరిగి పోయాయి. ఇంత హడావుడి లో సినిమా గురించి ఒక రూమర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఒక హిందీ హిట్ మూవీకి రీమేక్‌.. అయిదేళ్ల క్రితమే రీమేక్ చర్చలు జరిగాయి అనేది పుకారు.

పవన్‌ కళ్యాణ్ తో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాను మొదలు పెట్టిన హరీష్ శంకర్‌ ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కకు పెట్టాడు. వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత పవన్‌ కళ్యాణ్ తో హరీష్ శంకర్‌ ఉస్తాద్‌ భగత్ సింగ్ ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు రవితేజ తో జెట్‌ స్పీడ్ తో ఒక సినిమాను చేయబోతున్నాడు హరీష్ శంకర్‌.

రీమేక్ అయితే చాలా స్పీడ్ గా పూర్తి అవుతుందనే ఉద్దేశ్యంతో హిందీ హిట్ మూవీ 'రైడ్‌' ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. హిందీలో రైడ్ సినిమా వచ్చిన సమయంలోనే తెలుగు లో రవితేజ హీరోగా రీమేక్ అవ్వబోతుంది అనే ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో రైడ్ సినిమా రీమేక్‌ పట్టాలు ఎక్కలేదు.

ఎట్టకేలకు మిస్టర్ బచ్చన్ పేరుతో రైడ్‌ సినిమా రీమేక్‌ షురూ అయింది. రైడ్ సినిమా హీరో అజయ్ దేవగన్‌ 'మిస్టర్‌ బచ్చన్‌' పోస్టర్‌ ను షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో రీమేక్‌ కన్ఫర్మ్‌ అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మిస్టర్‌ బచ్చన్ గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది.

రవితేజ మిస్టర్‌ బచ్చన్ రీమేక్ అవ్వడంతో కచ్చితంగా హిట్‌ గ్యారెంటీ అనే టాక్‌ వినిపిస్తోంది. రైడ్‌ కాన్సెప్ట్‌ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి, ఆయన ఇమేజ్ కి బాగా సెట్‌ అయ్యే కథ అంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. తప్పకుండా రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ తో హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.