Begin typing your search above and press return to search.

మాస్ రాజా నయా దూకుడు..!

పక్కాగా చెప్పాలంటే ఏడాదికి రవితేజ 3 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట.

By:  Tupaki Desk   |   26 Jan 2024 8:30 AM GMT
మాస్ రాజా నయా దూకుడు..!
X

మాస్ మహారాజ్ రవితేజ ఒక సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది అంటే మరో సినిమా సెట్స్ మీద ఉంటుంది. జయాపజయాలకు అతీతంగా తన కెరీర్ కొనసాగిస్తూ వస్తున్నాడు రవితేజ. లాస్ట్ ఇయర్ వరకు ప్లాన్స్ ఎలా ఉన్నా మాస్ మహారాజ్ నయా దూకుడు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తనకున్న మార్కెట్ ని బట్టి ఆ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులను సమతూకం చేస్తూ తన సత్తా చాటుతూ వస్తున్నాడు రవితేజ.

ప్రస్తుతం రవితేజ నటించిన ఈగల్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా షురూ చేశాడు.

హరీష్ శంకర్ రవితేజ కాంబో అంటే మాస్ రాజా ఫ్యాన్స్ కి పండుగే. తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన రవితేజకు మరో హిట్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు హరీష్ శంకర్. ఇక ఈ సినిమా తర్వాత కుదిరితే ప్రశాంత్ వర్మతో ఒక సినిమా ఉంటుందని టాక్. అయితే అతను ఎలాగు జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉంటాడని తెలిసి జాతిరత్నాలు అనుదీప్ తో ఒక సినిమా లాక్ చేసుకున్నాడట.

జాతిరత్నాలు సినిమాతో డైరెక్టర్ గా అనుదీప్ తన మార్క్ చూపించారు. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో ప్రిన్స్ తీయగా అది తెలుగులో వర్క్ అవుట్ కాలేదు కానీ తమిళంలో హిట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా రవితేజతో అనుదీప్ సినిమా వస్తుంది. ఈ కాంబో మీద కూడా ఆడియన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ఈ ఇయర్ ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్న రవితేజ కుదిరితే అనుదీప్ సినిమాను కూడా ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

పక్కాగా చెప్పాలంటే ఏడాదికి రవితేజ 3 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట. అదే జరిగితే మాస్ రాజా ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు. ఏడాదికి 3 సినిమాలు చేస్తే 3 ప్రొడక్షన్స్ లో ఉన్న అందరికీ పని దొరికినట్టు అవుతుంది. సో తన పరంగా ఇండస్ట్రీలో కొంతమందికి వర్క్ వచ్చేలా చేస్తున్నాడు. అలా ఇండస్ట్రీకి తన వంతు సపోర్ట్ అందిస్తున్నాడు రవితేజ. ఏది ఏమైనా రవితేజ లో ఈ దూకుడు ఇలానే కొనసాగాలని మాస్ రాజా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.