Begin typing your search above and press return to search.

రవితేజ మాస్ కమ్ బ్యాక్.. ఈగల్ కు అదిరే వసూళ్లు

కొన్ని నెలలకు బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ఈ సీనియర్ హీరో.. ఇటీవలే ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   11 Feb 2024 8:30 AM GMT
రవితేజ మాస్ కమ్ బ్యాక్.. ఈగల్ కు అదిరే వసూళ్లు
X

టాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు మాస్ మహారాజా రవితేజ. తనదైన కామెడీ టైమింగ్ తో నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ముందుకు సాగుతున్నారు. కొన్ని నెలలకు బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ఈ సీనియర్ హీరో.. ఇటీవలే ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రవితేజ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రమే ఈగల్. ఈ హై రేంజ్ యాక్షన్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారమే విడుదలైన ఈ మూవీ డీసెంట్ టాక్ దక్కించుకుంది. దీంతో మంచి వసూళ్లు రాబడుతోంది.

రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో రవితేజ ఈగల్ పై చాలా ఫోకస్ చేసి హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ కార్తీక్ హీరో రవితేజను మునుపెన్నడూ లేని విధంగా చూపించారని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగుందని, అందులో చివరి 40 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని సినిమా చూసిన నెటిజన్లు చెబుతున్నారు

ఈగల్ లో యాక్షన్ సీన్లు అద్భుతం అంటే.. మరికొందరు హాలీవుడ్ టచ్ ఇవ్వడానికి ట్రై చేయడం గొప్ప విషయమంటూ పొగుడుతున్నారు. ఇక ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే దాదాపు రూ.6 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండో రోజు కూడా సాలిడ్ రెస్పాన్స్ లభించిందనే చెప్పాలి. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, రెండో రోజు సుమారు రూ. 4.75 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 10 కోట్లు వసూళ్లు సాధించింది.

అయితే రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన మాస్ మహారాజా.. క్లీన్ హిట్ కొట్టాలంటే ఇంకో రూ.12 కోట్లు కొల్లగొట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదివారం (మూడో రోజు) కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా పెద్ద హీరోల సినిమాలు ఏవి ప్రస్తుతం లేకపోవడం రవితేజకు కలిసొచ్చే అంశం. రజనీకాంత్ లాల్ సలామ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం కూడా ఈగల్ కు ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో థియేటర్ రన్ టైమ్ లోపు ఈగల్ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ పండితులు పేర్కొంటున్నారు. మంచి వసూళ్లు సాధిస్తుందని చెబుతున్నారు. మరి మీరు ఈ సినిమాను చూశారా?