Begin typing your search above and press return to search.

మహేష్, అల్లు అర్జున్.. ఇప్పుడు రవితేజ!

మాస్ మహారాజ్ జ్యోతి 70 ఎంఎం థియేటర్ ని ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ లో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే దిల్ సుఖ్ నగర్ లో ఏషియన్ వారితో కలిసి 6 స్క్రీన్స్ తో మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:15 AM GMT
మహేష్, అల్లు అర్జున్.. ఇప్పుడు రవితేజ!
X

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో ఏడాదికి మూడు సినిమాల వరకు చేస్తున్నాడు. ఒక్కో సినిమాకి 25 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా రవితేజతో మూవీస్ చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధం అవుతున్నారు. తాజాగా ఈగల్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అయితే అందుకోలేకపోయింది.

ఈగల్ నిర్మించిన పీపుల్స్ మీడియాలోనే మిస్టర్ బచ్చన్ మూవీ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ చేస్తున్నాడు. ఈ సినిమా మీద మాత్రం హోప్స్ ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అనుదీప్ కేవీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రవితేజ ఒక మూవీ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో హీరోలు కూడా సినిమా వ్యాపారంలోకి వస్తున్నారు.

నిర్మాతలుగా ఇతర హీరోలతో మూవీస్ చేస్తున్నారు. మహేష్ బాబు బ్యానర్ స్టార్ట్ చేసి చిన్న సినిమాలని ప్రోత్సహిస్తున్నారు. రవితేజ కూడా సొంత బ్యానర్ పెట్టి మూవీస్ చేస్తున్నాడు. థియేటర్స్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. మహేష్ బాబుకి ఏఎంబి మాల్ తో మల్టీప్లెక్స్ థియేటర్స్ స్టార్ట్ చేశారు. అమీర్ పేట లో అల్లు అర్జున్ సత్యం థియేటర్స్ ప్లేస్ లో మల్టీప్లెక్స్ ని ఏషియన్ మూవీస్ వారితో కలిసి స్టార్ట్ చేశాడు.

మాస్ మహారాజ్ జ్యోతి 70 ఎంఎం థియేటర్ ని ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ లో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే దిల్ సుఖ్ నగర్ లో ఏషియన్ వారితో కలిసి 6 స్క్రీన్స్ తో మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ అందుబాటులోకి రానున్నాయంట. త్వరలో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది.

మొత్తానికి రవితేజ ఇప్పటికే నిర్మాతగా మారి సినిమాలు చేస్తూనే ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణం ద్వారా థియేటర్స్ పైన పెట్టుబడులు పెడుతున్నాడని అర్ధమవుతోంది. విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఇంకెంత మంది హీరోలు ఇదే దారిలో థియేటర్స్ చైన్ బిజినెస్ లోకి వస్తారో అనేది వేచి చూడాలి.