Begin typing your search above and press return to search.

ర‌వితేజ‌కి జోడీ కుదిరింది..ఆవిడ ఈవిడేనా!

ఈ నేప‌థ్యంలో గోపీచంద్ మ‌లినేని ప్రాజెక్ట్ కి బ్రేక్ ప‌డినా రాజా మాత్రం వెంట‌నే మ‌రో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ని లైన్ లోకి తెచ్చి కొత్త సినిమా ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Dec 2023 6:59 AM GMT
ర‌వితేజ‌కి జోడీ కుదిరింది..ఆవిడ ఈవిడేనా!
X

మాస్ రాజా ర‌వితేజ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుసగా ప్రాజెక్ట్ ల‌న్నీ ప‌ట్టాలెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌యాల సంగ‌తి త‌ర్వాత చూద్దాం..ముందు క‌మిట్ అయిన సినిమాల‌న్నింటిని సెట్స్ కి తీసుకెళ్లిన త‌ర్వాత సంగ‌తి ఆలోచిద్దాం? అన్న ధోర‌ణిలో రాజా వేగం క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో గోపీచంద్ మ‌లినేని ప్రాజెక్ట్ కి బ్రేక్ ప‌డినా రాజా మాత్రం వెంట‌నే మ‌రో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ని లైన్ లోకి తెచ్చి కొత్త సినిమా ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే.


అయితే ఈసినిమా ప్ర‌క‌ట‌న వచ్చిన నాటి నుంచి మాస్ రాజాకి జోడీగా సీనియ‌ర్ హీరోయిన్ల‌ను ఎంపిక చేస్తున్నార‌ని..ముంబై...క‌న్న‌డ నుంచి కొత్త భామ‌ని తీసుకొస్తు న్నారాని..కొంత మంది భామ‌లు రిజెక్ట్ చేసార‌ని ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగింది. అయితే వీటిపై హ‌రీష్ శంక‌ర్ అంతే ధీటుగా స‌మాధానం ఇచ్చారు. ట్విట‌ర్ వేదిక‌గా అన్నిర‌కాల ప్ర‌చారాల‌న్ని ఆయ‌న ఖండించారు.


సినిమా అనుకున్న‌ప్పుడు రాజాకి హీరోయిన్ ఫిక్సైపోయింద‌ని హింట్ ఇచ్చేసారు. తాజాగా ఆభామ ఈవిడేన‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌లో `యారియాన్ ` 2లో రాజలక్ష్మిగా మెప్పించిన భామ `భాగ్యశ్రీ బోర్సేనే రవితేజ సినిమాలో కథానాయికగా ఎంపికైందన్న‌ది తాజా స‌మాచారం. నిన్నటి రోజున భాగ్యశ్రీ బోర్స్ టెస్ట్ లుక్ చేసిన‌ట్లు తెలిసింది. పాత్ర‌కి అన్నిర‌కాలుగా ఆమె స‌రితూగుతుంద‌ని మేక‌ర్స్ ఆమెని ఫైనల్ చేసిన‌ట్లు వినిపిస్తుంది.


భాగ్యశ్రీ బోర్సే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అటుపై న‌టిగా ప్ర‌మోట్ అయింది. అమ్మ‌డికి ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే భాగ్య శ్రీ పేరును హ‌రీష్ శంక‌ర్ అండ్ కో అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. భాగ్య శ్రీని ఎంపిక చేసిన‌ట్లు క‌న్ప‌మ్ అయితే నెట్టింట ఆమె పాపులారిటీ అంత‌కంత‌కు రెట్టింపు అవ్వ‌డం ఖాయం. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్ గా ఉండే బ్యూటీ అని అమ్మ‌డి చ‌ర్య‌ల్ని బ‌ట్టి తెలుస్తుంది.