Begin typing your search above and press return to search.

రెమ్యునరేషన్.. మాస్ రాజా అస్సలు తగ్గట్లే..

కొన్ని సినిమాలకి ఎక్కువ మొత్తంలోనే థీయాట్రికల్ రైట్స్ కోసం వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజకి ఒక సక్సెస్ పడితే రెండు ఫెయిల్యూర్ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Nov 2023 4:08 AM GMT
రెమ్యునరేషన్.. మాస్ రాజా అస్సలు తగ్గట్లే..
X

ప్రస్తుతం ఇండస్ట్రీలో మినిమం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు అందరూ రెమ్యునరేషన్ కోట్లలో తీసుకుంటున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ప్రభాస్ తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకి 150 కోట్ల వరకు ప్రభాస్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు, మూడు సినిమాలు హిట్ అయిన హీరో కూడా పది కోట్లకి పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

దీంతో సినిమాల నిర్మాణ వ్యయం రోజు రోజుకి పెరిగిపోతోంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెట్ క్రియేట్ అయ్యాక ఓటీటీల నుంచి డిజిటల్ రైట్స్ రూపంలో కోట్ల రూపాయిలు నిర్మాతలకి ముందుగానే వస్తున్నాయి. సినిమాకి పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా ఓటీటీ ద్వారానే వచ్చేస్తోంది. మిగిలిన సగం కోసం థీయాట్రికల్ బిజినెస్ చేస్తున్నారు సినిమాపై ఉన్న బజ్, హీరోకి ఉన్న మార్కెట్ లెక్కలు చూసుకొని డిస్టిబ్యూటర్స్ ప్రాంతాల వారీగా రైట్స్ కొంటున్నారు.

కొన్ని సినిమాలకి ఎక్కువ మొత్తంలోనే థీయాట్రికల్ రైట్స్ కోసం వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజకి ఒక సక్సెస్ పడితే రెండు ఫెయిల్యూర్ వస్తున్నాయి. అయిన కూడా నిర్మాతలు అతనితో మూవీస్ చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. దీనికి కారణం రవితేజ మార్కెట్ అని చెప్పాలి. ఈ మార్కెట్ లెక్కలు చూసుకొని అతని 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

దీంతో రవితేజ సినిమాల బడ్జెట్ 40 కోట్లు దాటిపోతున్నాయి. కొన్ని కథలకి ఇంకా ఎక్కువ బడ్జెట్ అవుతోంది. కాని ప్రాజెక్ట్ మాత్రం రిస్క్ అవుతోంది. ఈ ఏడాదిలో రవితేజ నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే రవితేజ రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. దీనికి కారణం ఈగల్ మూవీకి పీపుల్ మీడియా అంతే రెమ్యునరేషన్ ఇస్తోంది. అలాగే మరో పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా 25 కోట్లు అందుతోంది.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ రవితేజ, గోపీచంద్ కాంబోలో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అన్ని ఫైనల్ అయిన తర్వాత అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందనే క్లారిటీ వచ్చిందంట. రవితేజని రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరిన ఆయన వెనక్కి తగ్గకపోవడంతో సినిమాని హోల్డ్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.