Begin typing your search above and press return to search.

మళ్ళీ హ్యాట్రిక్ దెబ్బ.. కాస్త ఆలోచించుకో రాజా..

హిట్, ఫ్లాప్ తో సంబధం లేకుండా మూవీస్ తో దూసుకుపోతున్నాడు. అతను స్పీడ్ గా ఉన్నా కూడా రవితేజతో మూవీస్ చేస్తోన్న నిర్మాతలు మాత్రం దెబ్బ తింటున్నారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 3:15 AM GMT
మళ్ళీ హ్యాట్రిక్ దెబ్బ.. కాస్త ఆలోచించుకో రాజా..
X

టాలీవుడ్ లో అందరికంటే స్పీడ్ గా సినిమాలు చేస్తున్న హీరో అంటే మాస్ మహారాజ్ రవితేజ అని చెప్పాలి. సినిమాకి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఏడాదికి రెండు, మూడు సినిమాల వరకు చేస్తున్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబధం లేకుండా మూవీస్ తో దూసుకుపోతున్నాడు. అతను స్పీడ్ గా ఉన్నా కూడా రవితేజతో మూవీస్ చేస్తోన్న నిర్మాతలు మాత్రం దెబ్బ తింటున్నారు. దీనికి కారణం వరుస ఫ్లాప్ లు అని చెప్పాలి.

మాస్ మహారాజ్ రవితేజ తాజాగా ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా మొదటి రోజు నుంచి యావరేజ్ టాక్ తో నడుస్తోంది. అయితే వీకెండ్ మూడు రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చిన సోమవారం నుంచి గణనీయంగా డ్రాప్ అయ్యాయి. దీనిని బట్టి రవితేజ ఖాతాలో ఈ మూవీతో మరో హ్యాట్రిక్ ప్లాప్ వచ్చి చేరినట్లు అయ్యింది..

మాస్ రాజా 2017 నుంచి ఇప్పటి వరకు 13 సినిమాలు చేస్తే అందులో రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా మాత్రమే సోలో హిట్స్ గా నిలిచాయి. వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ అయిన అది మెగాస్టార్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. మిగిలిన సినిమాలన్నీ ప్లాప్ లుగానే మారాయి. రాజా ది గ్రేట్ మూవీ తర్వాత వరుసగా టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలతో నాలుగు డిజాస్టర్స్ రవితేజకి ఖాతాలో చేరాయి. 2021లో మరల క్రాక్ తో సూపర్ హిట్ కొట్టాడు.

ఆ తరువాత మళ్ళీ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ కాగా ధమాకా బ్లాక్ బస్టర్ పడింది. వెంటనే వాల్తేర్ వీరయ్యతో గత ఏడాది ఆరంభంలో హిట్ కొట్టిన మళ్ళీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో రెండు ఫ్లాప్ లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఈగల్ డిజాస్టర్ తో హ్యాట్రిక్ ఫ్లాప్ లు సొంతం అయ్యాయి. సినిమాలు వేగంగా చేస్తూ ఫ్లాప్ లు ఖాతాలో వేసుకోవడం వలన రవితేజ మార్కెట్ దెబ్బ తింటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే నాన్ థీయాట్రికల్ రైట్స్ పరంగా కూడా వెయిటేజ్ తగ్గిపోతుంది.

ధమాకా, వాల్తేర్ వీరయ్యతో రేసులోకి వచ్చాడని అనుకుంటే వరుసగా మూడు భారీ డిజాస్టర్ లతో నిర్మాతలని కూడా రవితేజ టెన్షన్ పెడుతున్నాడనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు. హరీష్ శంకర్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో దీనిపై హోప్స్ ఉన్నాయి. రవితేజ నుంచి ఆడియన్స్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. దానిని పక్కన పెట్టి సీరియస్ గా ట్రై చేసిన ప్రతి సినిమా ఫెయిల్ అవుతోంది. తనని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న జోనర్ లో మూవీస్ చేస్తేనే మళ్ళీ మాస్ రాజా సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.