Begin typing your search above and press return to search.

రియల్‌ తుపాకీ తో మాస్‌ రాజా.. అసలేం జరిగింది!

ఆయన మాట్లాడుతూ.. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్ సమక్షంలో రవితేజ గారు గన్ ఫైరింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 10:02 AM IST
రియల్‌ తుపాకీ తో మాస్‌ రాజా.. అసలేం జరిగింది!
X

మాస్ మహారాజా రవితేజ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సక్సెస్‌, ఫ్లాప్ అనే విషయాలను పరిగణలోకి తీసుకోకుండా రవితేజ తన సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ప్రస్తుతం చేస్తున్న మూవీ 'ఈగల్‌'. గత సినిమాల ఫలితాల గురించి పెద్దగా పట్టింపు లేకుండా ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఈగల్ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.

కార్తీక్‌ ఘటమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోని భారీ యాక్షన్‌ సన్నివేశాలను యూరప్ లో చిత్రీకరించారట. తాజాగా చిత్ర షూటింగ్‌ కు సంబంధించిన విషయాలను వెళ్లడించడంతో పాటు, షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకుడు కార్తీక్ ఘటమనేని షేర్‌ చేసుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ.. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్ సమక్షంలో రవితేజ గారు గన్ ఫైరింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. అందుకోసం రియల్ గన్స్ ను మరియు రియల్‌ బుల్లెట్స్ ను వినియోగించాం. రవితేజ గారి అంకిత భావం మరియు ఆయన ఎనర్జీ తో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అన్నాడు.

అనుపమ పరమేశ్వరన్‌ మరియు కావ్య థాపర్ హీరోయిన్స్ లు గా నటిస్తున్న ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా షూటింగ్ ను శర వేగంగా జరుపుతున్నారు. ఇటీవల వచ్చిన ప్రమోషనల్‌ వీడియో మరియు పోస్టర్ లు సినిమా స్థాయిని అమాంతం పెంచాయి.

మరోసారి రవితేజ ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఈ సినిమా తో దక్కించుకోబోతున్నాడు అనిపిస్తోందని రవితేజ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. రవితేజ లోని పూర్తి మాస్ యాంగిల్ ను దర్శకుడు ఈగల్ లో చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇటీవల విడుదల అయిన టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది. తీవ్రమైన పోటీ నేపథ్యంలో జనవరి 13న విడుదల అవ్వబోతున్న ఈగల్ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.