Begin typing your search above and press return to search.

RT4GM : ఫస్ట్‌ సెకండ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌!

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీదున్నాడు. ఫలితాల తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   30 Oct 2023 1:30 PM GMT
RT4GM : ఫస్ట్‌ సెకండ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌!
X

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీదున్నాడు. ఫలితాల తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. మొన్న దసరా సందర్భంగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా థియేటర్‌ లో ఉండగానే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమాను ప్రకటించారు.

రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఇప్పటి వరకు డాన్‌ శ్రీను, బలుపు మరియు క్రాక్ సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలకు మూడు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. వీరి కాంబోలో హ్యాట్రిక్ నమోదు అవ్వడం తో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు డబుల్‌ హ్యాట్రిక్ మూవీకి ముందుకు వచ్చారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో భారీ బడ్జెట్‌ తో రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చింది. చాలా విభిన్నంగా ఫోటోలను విడుదల చేసి మరీ సినిమా ను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాలో తమిళ దర్శకుడు కమ్‌ నటుడు సెల్వ రాఘవన్‌ నటించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు అంటూ మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. పలు పేర్లు కూడా వినిపించాయి. తాజాగా మరో కొత్త పేరు విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తుంది. రాశి ఖన్నా ను మైత్రి మూవీ మేకర్స్ వారు సంప్రదించడం తో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

రవితేజ తో రాశి ఖన్నా గతంలో నటించిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్‌ హీరోయిన్ కాకుండా సెకండ్‌ హీరోయిన్‌ గా రాశి ఖన్నా ను నటింపజేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక బాలీవుడ్‌ ముద్దుగుమ్మను మెయిన్‌ హీరోయిన్‌ గా నటింపజేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొదట సెకండ్‌ హీరోయిన్ ను ఫిక్స్ చేసిన మేకర్స్ ఫస్ట్‌ హీరోయిన్‌ ని ఎప్పుడు కన్ఫర్మ్‌ చేస్తారో చూడాలి.