Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా జాతర!

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:30 AM GMT
మాస్ మహారాజా జాతర!
X

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోస్టర్స్ తోనే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ సినిమాలో కావ్య తప్పర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు.


ఇక టీజర్ ట్రైలర్ ద్వారా అంచనాల స్థాయిని అమాంతం పెంచేసిన ఈ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ తో సాలిడ్ కలెక్షన్స్ అయితే అందుకుంది. రవితేజ కెరీర్లో అత్యధిక స్థాయిలో గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలలో ఈగల్ కూడా టాప్ లిస్టులో చేరిపోయింది. ఇక ఈ సినిమా వీకెండ్ ను చాలా చక్కగా ఉపయోగించుకుంది. చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి.

ఇక లేటెస్ట్ గా చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరొక మార్క్ ను అందుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో మొత్తం 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. రవితేజ కెరియర్ లోనే అత్యధిక వేగంగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఇది కూడా ఒకటి.

ఇక ఈ సినిమా మాస్ ఏరియాల లోనే కాకుండా క్లాస్ ఏరియాలలో కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతోంది. సోమవారం నుంచి సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది. బుకింగ్స్ అయితే గట్టిగానే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వీకెండ్ తర్వాత కూడా సినిమా మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పోటీగా కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేవు.

రీసెంట్ గా వచ్చిన సినిమాలకు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ ఏమి రాలేదు కాబట్టి ఈ వారం మొత్తం కూడా ఈగల్ సినిమా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటంతో ఏదో ఒక సినిమా తప్పుకోవాలి అని నిర్మాతలు సూచించారు. దీంతో ఈగల్ సినిమా డేట్ మార్చుకున్న విషయం తెలిసిందే.