Begin typing your search above and press return to search.

రవితేజ పొటెన్షన్ కు అసలు సిసలైన టెస్ట్..!

ఈగల్ తో వస్తున్న యాత్ర 2 కమర్షియల్ సినిమా కాదు. సో ఆ సినిమా వల్ల ఈగల్ కు పోటీ కాదు. సో ఆ లెక్కన రవితేజ సినిమా సోలోగా వస్తున్నట్టే అనుకోవచ్చు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 8:30 AM GMT
రవితేజ పొటెన్షన్ కు అసలు సిసలైన టెస్ట్..!
X

మాస్ మహరాజ్ రవితేజ బాక్సాఫీస్ పొటెన్షన్ ఏంటన్నది ఆయన హిట్ సినిమా వసూళ్లను చూస్తే అర్ధమవుతుంది. 2022 ధమాకా సక్సెస్ తో 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు రవితేజ. స్వశక్తితో ఎదిగిన హీరోల్లో ఒకరైన రవితేజ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. అయితే వారు మాత్రమే కాదు రవితేజ సినిమా బాగుంది అంటే చూసేందుకు మొదటి ప్రియారిటీ ఇచ్చే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందులో ఉంటారు.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తుంటాడు. క్రాక్ తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ధమాకాతో బాక్సాఫీస్ దగ్గర తన దమ్ము చూపించాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ చిరు అకౌంట్ లోకి వెళ్లినా ఆ సినిమా సక్సెస్ లో కూడా రవితేజ కారణమయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రెండు ఫ్లాపులు పడ్డాయి. ప్రతి సినిమాకు హీరో పడే కష్టం ఒకటే అయినా సినిమాలు ఇచ్చే ఫలితాలు వారి నెక్స్ట్ సినిమాకు హెల్ప్ అవుతుంది.

రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు ఫలితాలతో నిరాశలో ఉన్న రవితేజ ఈగల్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగల్ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకుని సోలో రిలీజ్ అంటూ వస్తున్న ఈగల్ సినిమా రవితేజ మాస్ పొటెన్షన్ చూపించాల్సి ఉంది.

ఈగల్ తో వస్తున్న యాత్ర 2 కమర్షియల్ సినిమా కాదు. సో ఆ సినిమా వల్ల ఈగల్ కు పోటీ కాదు. సో ఆ లెక్కన రవితేజ సినిమా సోలోగా వస్తున్నట్టే అనుకోవచ్చు. మరి ఈ ఈగల్ ఫైట్ తో రవితేజ మాస్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. అనుపమ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించిన ఈగల్ సినిమాకు దేవ్ జాండ్ మ్యూజిక్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిమ్రించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈగల్ హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు ఏ పోటీ లేదు కాబట్టి మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ సందీప్ కిషన్ సినిమా ఉన్నా ఆ సినిమా జానర్ వేరు కాబట్టి రవితేజ సినిమా వసూళ్లకు అడ్డు కాకపోవచ్చు.