Begin typing your search above and press return to search.

ఈగల్ ఫస్ట్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశాడుగా..

తాజాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించింది మూవీ యూనిట్. హీరో, దర్శకుడు, నిర్మాత తదితరులు సినిమా స్పెషల్ ప్రివ్యూ చూశారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 5:01 AM GMT
ఈగల్ ఫస్ట్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశాడుగా..
X

మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ మల్టీపుల్ షేడ్స్ లో అలరించనున్నారు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ.. మరో మూడు రోజుల్లో విడుదల కానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు మేకర్స్. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. మొన్న ఈవెంట్ లో మరో సాంగ్ ను విడుదల చేశారు. ఈగల్ అవుట్ పుట్ అదిరిందని, మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు రవితేజ.

తాజాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించింది మూవీ యూనిట్. హీరో, దర్శకుడు, నిర్మాత తదితరులు సినిమా స్పెషల్ ప్రివ్యూ చూశారు. ఈగల్ చూశాక రవితేజ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఐ యామ్ ఫుల్ శాటిస్ఫైడ్ అంటూ ఒక్క మాటలో తన సినిమా మీద తానే రివ్యూ ఇచ్చేసుకున్నారు. చాలా బాగుందన్నట్టుగా రవితేజ చెప్పకనే చెప్పేశారు.

ఇక దర్శక నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు. ఇలా మొత్తానికి ఈగల్ ఫస్ట్ రివ్యూ మాత్రం రవితేజ నోటి నుంచే వచ్చేసింది. రవితేజ రివ్యూ చెప్పిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో ఈగల్ సందడి చేయబోతోందంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీలో రవితేజ.. పత్తి రైతుల సమస్యలపై పోరాడుతారని ప్రమోషన్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది.

ధమాకా సినిమా తర్వాత రవితేజ సరైన హిట్ కొట్టలేకపోయారు. వాల్తేరు వీరయ్య విజయం అంతా చిరు ఖాతాలోకి వెళ్లింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. ఇప్పుడు రవితేజ చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్న ఈగల్ సినిమా వచ్చేస్తోంది. మరి ఈ మూవీ.. హిట్ లేక సతమతమవుతున్న రవితేజకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.