Begin typing your search above and press return to search.

హ‌రీష్ శంక‌ర్ కూడా బోయ‌పాటి రేంజ్ లో ప్లాన్ చేసాడా?

`లెజెండ్` లో బాల‌య్య‌-జ‌గ‌ప‌తి బాబు మ‌ధ్య ఎలాంటి పవ‌ర్ ఫుల్ డైలాగులుంటాయో తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 April 2024 5:17 AM GMT
హ‌రీష్ శంక‌ర్ కూడా బోయ‌పాటి రేంజ్ లో ప్లాన్ చేసాడా?
X

`లెజెండ్` లో బాల‌య్య‌-జ‌గ‌ప‌తి బాబు మ‌ధ్య ఎలాంటి పవ‌ర్ ఫుల్ డైలాగులుంటాయో తెలిసిందే. పేస్ టూ పేస్ ఇద్ద‌రు త‌ల‌ప‌డే స‌న్నివేశాలు..విసురుకునే పంచ్ డైలాగులు మామూలుగా ఉండ‌వు. థియేట‌ర్లో అరుపులే.. `దా..దా` అంటూ ఇరువురు ఒక‌ర‌కొక‌రు మీద‌కెళ్లిపోయే స‌న్నివేశం మామూలుగా పేల‌లేదు. ఇద్ద‌ర్నీ ఎలా హైలైట్ చేయాలో ప‌క్కాగా ప్లాన్ చేసి దించాడు బోయ‌పాటి. స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశాన్నే త‌ల‌పించారు మాస్ రాజారాజా ర‌వితేజ‌..జ‌గ‌ప‌తిబాబు. ర‌వితేజ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.


ఇందులో జ‌గ‌ప‌తిబాబు కీల పాత్ర పోషిస్తున్న సంగ‌తి ఓ సర్ ప్రైజింగ్ గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏకంగా జ‌గ‌ప‌తి బాబు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసాడు. జ‌గ‌ప‌తి బాబు లుక్ కొత్త‌గా ట్రై చేసిన‌ట్లు ఉంది. మెడ‌లో.. చేతిలో రుద్రాక్ష‌లు ధ‌రించి త‌న‌ని శాంత‌మూర్తిగా చూపించినా..వైరం వ‌స్తే ఎలా ఉంటుందో? అత‌డి క‌ళ్ల‌లో చూపించారు. సోష‌ల్ మీడియాలో కూడా జ‌గ‌ప‌తిబాబు పాత్ర ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో రివీల్ చేసేసారు. `మిస్టర్ బచ్చన్` లో మాస్ మహారాజ ను ఏసెయ్యడానికి సిద్దం! అని జగపతి బాబు సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టాడు.

దానికి మాస్ రాజా అంతే ధీటుగా బ‌ధులిచ్చాడు. మిస్టర్ బచ్చన్ ఇక్కడ.. ఎవరు ఎవర్ని ఏస్తారో? చూస్కుందాం అంటూ చెప్పుకొచ్చారు. ఇద్ద‌రి మ‌ధ్య ఈ సీరియ‌స్ సంభాష‌ణ చ‌ర్చ‌కొచ్చింది. మ‌రి ఆన్ స్క్రీన్ పై ఆ రెండు పాత్ర‌లు ఎంత‌టి ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటాయో చూడాలి. ఈ సంభాష‌ణ చూసిన త‌ర్వాత హ‌రీష్ కూడా బోయ‌పాటి రేంజ్ లో యాక్ష‌న్ స‌న్నివేశాలు ధారాళంగానే ప్లాన్ చేసి ఉంటాడ‌ని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి.

ర‌వితేజ‌-జ‌గ‌ప‌తి బాబు కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే నేల‌టికెట్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ మాస్ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసింది లేదు. మ‌ళ్లీ ఇంత కాలానికి ఆ కాంబినేష‌న్ సాధ్య‌మైంది. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాడు. విల‌న్ గా ట‌ర్న్ అయిన త‌ర్వాత అవ‌కాశాలు పెరిగాయి. పాన్ ఇండియా చిత్రాల్లో సైతం త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. వ‌చ్చిన రోల్ ఎలాంటిదైనా నో చెప్ప‌కుండా చేస్తున్నాడు.