Begin typing your search above and press return to search.

రవితేజ.. మళ్ళీ దోంగ వేషాలు

ముఖ్యంగా ప్రతి ఏడాది మూడు సినిమాలు చేస్తే మినిమం ఒక సినిమాతో అయినా గట్టిగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   25 April 2024 9:55 AM GMT
రవితేజ.. మళ్ళీ దోంగ వేషాలు
X

మాస్ మహారాజ రవితేజ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాలను అందుకుంటున్నాడు. ఒక విధంగా అతని సక్సెస్ రేటు అంత స్టడీగా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా అవకాశాలు అయితే గట్టిగానే వస్తూ ఉన్నాయి. వరుస సక్సెస్ లు లేకపోయినా అప్పుడప్పుడు మాత్రం సాలిడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రతి ఏడాది మూడు సినిమాలు చేస్తే మినిమం ఒక సినిమాతో అయినా గట్టిగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాడు.

క్రాక్ సినిమా తర్వాత రవితేజ మార్కెట్ కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది. ఇక ధమాకా సినిమాతో మొదటిసారి 100 కోట్లను టచ్ చేసిన ఈ హీరో గత ఏడాది వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ తో కలిసి మరో సక్సెస్ ను షేర్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఈగల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇవి అంతగా సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన రెయిడ్ కు రీమేక్ గా ఈ సినిమా రాబోతోంది. ఇక మరోవైపు రవితేజ కామెడీ డైరెక్టర్ అనుదీప్ తో కూడా ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ కాంబినేషన్ పై అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

నిజానికి ఎప్పుడో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రావాలి. కానీ కథ విషయంలో రవితేజ కాంప్రమైజ్ కాకపోవడంతో దర్శకుడు ఇంకాస్త ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కాంబినేషన్లో రాబోతున్న కాన్సెప్ట్ గురించి మరొక లీక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రవితేజ ఒక దొంగగా కనిపించబోతున్నట్లు సమాచారం.

దొంగ పోలీస్ కాన్సెప్ట్ లో దర్శకుడు అనుదీప్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రవితేజ కెరీర్ లో దొంగగా కనిపించిన సినిమాలు బాగానే వచ్చాయి. దొంగోడు, విక్రమార్కుడు లాంటి సినిమాలతో అతను బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు.

ఆ తర్వాత కిక్ సినిమాల్లో కూడా అతను చేసిన పాత్ర దాదాపు అలాంటిదే. ఇక దొంగల ముఠా, దరువు, కిలాడే లాంటి సినిమాల్లో కూడా రాబరీలు చేస్తూ తనలోనే దొంగ క్యారెక్టర్ ను హైలెట్ చేశాడు. గత ఏడాది వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కూడా ఒక దొంగ బయోపిక్. ఇక ఇప్పుడు అనుదీప్ దర్శకత్వంలో కూడా దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈసారి రవితేజ దొంగ క్యారెక్టర్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.