Begin typing your search above and press return to search.

అసలైన ట్రాక్ లోకి రవితేజ.. అతనికి లక్కీ ఛాన్స్!

తాజాగా మరో కామెడీ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన సామజవరగమన మూవీ రచయిత భాను భోగవరపు

By:  Tupaki Desk   |   4 April 2024 9:30 AM GMT
అసలైన ట్రాక్ లోకి రవితేజ.. అతనికి లక్కీ ఛాన్స్!
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ప్రతి పని, ప్రతి పాత్ర చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగి మంచి పేరు దక్కించుకున్నారు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిర్మాతగా కూడా పలు మూవీలను నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈగల్ మూవీతో థియేటర్లోకి వచ్చినా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోయారు. కొన్నేళ్లుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నా సరైన హిట్ కొట్టలేకపోతున్నారు. మధ్యలో ధమాకా మూవీ తప్ప మిగతా రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ధమాకా కంప్లీట్ యాక్షన్ మూవీ కాదు. మొన్న వచ్చిన ఈగల్ కాస్త పర్వాలేదనిపించింది.

వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నా కలిసి రాకపోవడంతో ఇటీవల రవితేజ తన రూట్ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జోనర్ కు మళ్లీ షిఫ్ట్ అవుతున్నారట. కొత్త దర్శకులతో సినిమాలు చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యారని టాక్. ఇప్పటికే ఎంతో మంది కొత్త డైరెక్టర్ల తో సినిమాలు చేసిన రవితేజ.. ప్రస్తుతం జాతి రత్నాలు అనుదీప్ తో ఓ కామెడీ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా మరో కామెడీ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన సామజవరగమన మూవీ రచయిత భాను భోగవరపు ఇటీవల రవితేజకు స్టోరీ నెరేట్ చేశారట. దీంతో ఆ కథ బాగా నచ్చి.. భానును దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు రవితేజ డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చిన్న చిత్రంగా వచ్చి సామజవరగమన మూవీ ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. యంగ్ హీరో శ్రీవిష్ణు ఈ మూవీలో కామెడీతో పాటు డైలాగ్స్ తో అలరించారు. స్టోరీకి బాగా అట్రాక్ట్ అయ్యారు ఆడియన్స్. ఇప్పుడు భాను కొత్త కథ కూడా అంతే లెవెల్ లో ఉంటే, దానికి రవితేజ కామిక్ టైమింగ్ యాడ్ అయితే రిజల్ట్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో మాస్ మహా రాజా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ సాధిస్తారో వేచి చూడాలి.