Begin typing your search above and press return to search.

కామెడీ దర్శకుడిపై మాస్ రాజా స్పెషల్ ఫోకస్

అయితే మాస్ మహారాజ్ మాత్రం జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో ఆకట్టుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 3:53 AM GMT
కామెడీ దర్శకుడిపై మాస్ రాజా స్పెషల్ ఫోకస్
X

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలని ఎంచుకుంటూ ట్రావెల్ చేస్తున్నారు. ఈ జర్నీలో కొత్త దర్శకులకి కూడా రవితేజ అవకాశం ఇస్తూ ఉండటం విశేషం. అయితే కొంత మంది రవితేజ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే మరికొంతమంది ఫెయిల్ అవుతున్నారు.

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుతో దసరాకి రావడం కోసం రవితేజ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్నారు. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తోన్న ఈగల్ మూవీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో ఆ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత మరికొంత మంది దర్శకులు రవితేజతో సినిమా కోసం లైన్ లో ఉన్నారు.

అయితే మాస్ మహారాజ్ మాత్రం జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో ఆకట్టుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. అనుదీప్ కేవీ కామెడీ టైమింగ్ రవితేజకి బాగా నచ్చడంతో అతనితో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఒక సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు కథలు వరకు విన్నా కూడా ఏదీ రవితేజకి నచ్చలేదంట.

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ సందడి ముగిసిన తర్వాత మరల అనుదీప్ తో మరో స్టోరీ సిట్టింగ్ కోసం కూర్చోవాలని రవితేజ అనుకుంటున్నారంట. ప్రిన్స్ మూవీ తర్వాత వెంకటేష్ తో అనుదీప్ ఒక మూవీ చేయాలని అనుకున్నారు. సురేష్ బాబు అతనిని కూర్చోబెట్టి స్టోరీ కూడా రాయించారు. అయితే ఆ కథ వెంకటేష్ కి నచ్చకపోవడంతో అనుదీప్ ని పక్కన పెట్టి శైలేష్ కొలనుతో సెట్స్ పైకి వెళ్లిపోయారు.

అయితే రవితేజ మాత్రం అతనితో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తన నుంచి ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ తనివితీరా నవ్వుకునే సినిమా రాకపోవడంతో అనుదీప్ కామెడీ టైమింగ్ నచ్చడంతో అతనికి ఛాన్స్ ఇవ్వాలని రవితేజ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.