Begin typing your search above and press return to search.

విక్ర‌మార్కుడు సీక్వెల్ అందుకే తీయ‌లేదు

విక్రమార్కుడు 2 గురించి నేను ఎస్ఎస్ రాజమౌళితో మాట్లాడలేదు. కానీ వారు నిజంగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని నేను విన్నాను! అని మాస్ రాజా అన్నారు.

By:  Tupaki Desk   |   15 Oct 2023 3:13 AM GMT
విక్ర‌మార్కుడు సీక్వెల్ అందుకే తీయ‌లేదు
X

మాస్ మహారాజా రవితేజ .. SS రాజమౌళి కాంబినేష‌న్ మూవీ 'విక్ర‌మార్కుడు' 2006లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. యాక్షన్-ప్యాక్డ్ మూవీ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా పలు భారతీయ భాషల్లో రీమేక్ అయింది. భాష‌ల‌తో సంబంధం లేకుండా అన్ని సరిహద్దులను చెర‌పేస్తూ ప్ర‌తిచోటా ఆక‌ట్టుకుంది. కొన్నేళ్లుగా ఈ చిత్రం ఫ్రాంచైజీగా అభివృద్ధి చెందుతుందనే చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి ఇంట‌ర్వ్యూలో రవితేజ ఈ క్రేజీ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడారు.

నిజానికి రవితేజ 'విక్రమార్కుడు 2'కి సంబంధించి ఎస్ఎస్ రాజమౌళితో ఇంకా ఎలాంటి సంభాషణలు జరపలేదని వెల్లడించారు. విక్రమార్కుడు 2 గురించి నేను ఎస్ఎస్ రాజమౌళితో మాట్లాడలేదు. కానీ వారు నిజంగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని నేను విన్నాను! అని మాస్ రాజా అన్నారు. రవితేజ - SS రాజమౌళి మధ్య స్నేహానుబంధం బాహుబ‌లి కంటే చాలా ముందు నుంచి ఉన్న‌ది. బాహుబ‌లి విజ‌యం భారతీయ సినిమా అత్యంత ప్రముఖ దర్శకులలో ఒకరిగా రాజమౌళి స్థానాన్ని పటిష్టం చేసింది.

అత‌డి ఇటీవలి పాన్-ఇండియన్ విడుదల RRR ప్రపంచవ్యాప్తంగా వేవ్స్ సృష్టించింది. సినిమాటిక్ మేధావిగా రాజ‌మౌళి స్థాయిని ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. త‌దుప‌రి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో రాజ‌మౌళి ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అయినా మాస్ మ‌హారాజా రవితేజ మరోసారి ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేసే వీలుందా? అంటూ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.

రాజ‌మౌళితో మ‌రోసారి క‌లిసి ప‌ని చేస్తారా? అని ర‌వితేజ‌ను ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తాన‌ని అన్నారు. నేను ఎస్ఎస్ రాజమౌళితో పదే పదే పనిచేయాలనుకుంటున్నాను. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎస్ఎస్ రాజమౌళితో పనిచేయడానికి ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నారా? అని కూడా ర‌వితేజ ఎదురు ప్ర‌శ్నించారు. రవితేజ తన తొలి పాన్-ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, తన అభిమాన ప్రేక్షకులను అలరించడంపైనే ప్రాథమిక దృష్టి ఉంటుందని పునరుద్ఘాటించాడు.

విభిన్న వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే లక్ష్యంతో యాక్షన్, ఎమోషన్, డ్రామాను సజావుగా మిళితం చేసే చిత్రాలపై తన ప్రేమ ఆస‌క్తి గురించి ర‌వితేజ వెల్ల‌డించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంటున్నాను. వినోదానికే నా ప్రాధాన్యత. నేను ఎప్పుడు ఆఫ్‌బీట్‌గా చేసినా అది మంచి సినిమా అయినప్పటికీ స‌క్సెస్ కాలేదు! అని రవితేజ వెల్ల‌డించారు. రవితేజ తదుప‌రి - ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రంలో న‌టించే వీలుంద‌ని కూడా హింట్ ఇచ్చారు. ''త్వరలో నేను సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్నాను'' అని అభిమానులకు రాజా తెలిపాడు.