రవితేజ, నాని వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ ఇవే... అందుకే సక్సెస్ అయ్యారా...
నాని కూడా హీరోగా మారడానికి ముందు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయి మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోగా మారిపోయాడు...
By: Tupaki Desk | 20 Sept 2026 9:36 AM ISTసినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉంటేనే రాణించవచ్చు అనే ధోరణిలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వాళ్లకి మొదటి అవకాశం వచ్చేంత వరకే ఆ బ్యాగ్రౌండ్ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లను వాళ్ళు పూర్వ చేసుకుంటేనే ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం వాళ్లు కూడా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఫేడ్ ఔట్ అయిపోయే పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫ్యామిలీ ల నుంచి చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే స్టార్ హీరోల పొజిషన్లో కొనసాగుతున్నారు. టాలెంట్ లేని వారిని ఎవరు పట్టించుకోరనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే సోలో గా ఇండస్ట్రీకి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన వాళ్లలో 'మెగాస్టార్ చిరంజీవి' ఒకరు. ఆయన తర్వాత రవితేజ ఏ సపోర్టు లేకుండా వచ్చి తనకంటూ ఒక రూట్ ను ఏర్పాటు చేసుకున్నాడు. నాని సైతం అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసే పొజిషన్లో ఉన్నాడు. రవితేజ - నాని ఇద్దరిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరు సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలిచారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు... వీళ్ళిద్దరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లుగా తమ కెరీర్ ని మొదలుపెట్టిన వారే కావడం విశేషం... ఇక అనుకోకుండా వచ్చిన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని నటులుగా రాణించారు. రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు.
నాని కూడా హీరోగా మారడానికి ముందు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయి మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోగా మారిపోయాడు... వీళ్ళిద్దరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్ ల వర్క్ ఎలా ఉంటుందనే విషయంలో కొన్ని మెలుకువలను నేర్చుకున్నారట. అందువల్లే వాళ్ళు హీరోలుగా మారిన తర్వాత ఒక కథను విన్నప్పుడు ఆ కథ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా? లేదా అనే ధోరణిలో ఆలోచించి ఆ సినిమా చేయొచ్చా లేదా అనే డిసిజన్ తీసుకుంటున్నారు. ఒక రకంగా వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం వల్ల కూడా వాళ్లకు సినిమా పట్ల చాలావరకు నాలెడ్జ్ వచ్చిందనే చెప్పాలి. పర్సనల్ లైఫ్ లో ఇద్దరు కూడా సాఫ్ట్ కార్నర్ కలిగిన వారే కావడం విశేషం. చాలా ఎక్కువ మంది కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో వీళ్ళిద్దరు ముందు వరుసలో ఉన్నారు.
ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ మూలాలను మర్చిపోవడం లేదు. కాబట్టి ఇండస్ట్రీ లో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందనేది వాళ్ళకి తెలుసు. అందుకే మంచి కథ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు... ఈరోజు వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే దానికి వాళ్ళ బిహేవిరే కారణం అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రవితేజ రీసెంట్ గా 'ఇరుముడి' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనానికి క్రియేట్ చేశాడు. ఈనెల 24వ తేదీన నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్ ' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి ఈ సినిమాతో కూడా ఆయన భారీ విజయాన్ని అందుకొని మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు...
