మాస్ అనార్కలి : ఆ ఇద్దరు కాదు.. ఈ ఇద్దరు కన్ఫర్మ్
మాస్ మహారాజా రవితేజ సినిమాల జోరు కాస్త తగ్గడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 Jun 2025 5:00 PM ISTమాస్ మహారాజా రవితేజ సినిమాల జోరు కాస్త తగ్గడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ 'మాస్ జాతర' విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. అందుకు కారణం ఏంటి అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే మాస్ జాతర సినిమా విడుదల చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. రవితేజ అనారోగ్య పరిస్థితుల కారణంగా సినిమాల స్పీడ్ తగ్గింది. ఈ మధ్య కాలంలో రవితేజ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. కనుక ఇక జోరు పెంచాలనే ఉద్దేశంతో ఆయన భావిస్తున్నట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మాస్ జాతర సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. విడుదలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమా విడుదలకు ముందే రవితేజ తదుపరి సినిమా 'అనార్కలి' షూటింగ్ ప్రారంభం కాబోతుంది. కొన్ని వారాల క్రితం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా అనార్కలి సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యాయి. రవితేజ డేట్ల కోసం దర్శకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యం అయిన సినిమాను షూటింగ్ ప్రారంభం తర్వాత గ్యాప్ లేకుండా తీయాలని భావిస్తున్నారు.
ఈనెల చివరి వరకు లేదా వచ్చే నెలలో 'అనార్కలి' షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. కేవలం నాలుగు లేదా అయిదు నెలల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే విధంగా కిషోర్ తిరుమల ప్లాన్ చేస్తున్నాడట. అందుకే హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా డేట్లు ఈజీగా దొరికే హీరోయిన్స్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అనార్కలి సినిమాను ప్రకటించిన సమయంలో ముద్దుగుమ్మలు మమితా బైజు, కయాదు లోహర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. రవితేజకు జోడీగా వీరిద్దరు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా తెగ చక్కర్లు కొట్టాయి. కట్ చేస్తే సినిమాలోకి కేతిక శర్మ, ఆషిక రంగనాథ్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఆ ఇద్దరు కాదు.. ఈ ఇద్దరు అని మేకర్స్ నుంచి అతి త్వరలో ప్రకటన రాబోతుంది.
అనార్కలి సినిమా కథ రెడీ అయిన వెంటనే మమిత బైజు, కయాదు లోహర్‌లను అనుకున్న మాట వాస్తవం, కానీ ప్రస్తుతం ఆ ఇద్దరు, తమిళ, మలయాళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి నుంచి బల్క్‌గా డేట్లు కావాలంటే సాధ్యం అయ్యే పని కాదు. ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ఇద్దరి డేట్లు కూడా సెట్ అయ్యి షూటింగ్ పూర్తి చేయాలంటే ఆరు నెలలకు మించి సమయం పడుతుంది. అందుకే ఆ ఇద్దరిని కాదని పెద్దగా బిజీగా లేని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆషికా రంగనాథ్ ఆ మధ్య నాగార్జునతో నా సామిరంగ సినిమాలో నటించి ఆకట్టుకుంది. కనుక రవితేజతోనూ ఈమె సెట్ అవుతుందనే ఉద్దేశంతో ఎంపిక చేశారు. ఇక గ్లామర్ షోకి కేతిక శర్మను ఎంపిక చేసి ఉంటారని టాక్. అతి త్వరలోనే ఈ అనార్కలి గురించి పూర్తి విషయాలు వెళ్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
