Begin typing your search above and press return to search.

చిరంజీవి చెప్పబట్టే రాజశేఖర్ కి ఆ ఛాన్స్ వచ్చింది..!

అయితే తన ప్లేస్ లో ఆ పాత్రకు రాజశేఖర్ అయితే పర్ఫెక్ట్ అని రిఫర్ చేశారట చిరు. అలా చిరు చేయాల్సిన న్యాయం కావాలి సినిమాలో రాజశేఖర్ నటించారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 12:30 AM GMT
చిరంజీవి చెప్పబట్టే రాజశేఖర్ కి ఆ ఛాన్స్ వచ్చింది..!
X

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ చేసిన ఒక సినిమాను చిరంజీవి చేయాల్సి ఉన్నా ఆ పాత్ర రాజశేఖర్ కి బాగుంటుందని చిరు వదులుకున్నారట. సినీ పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం అనేది చాలా కామన్ దాదాపు ఒక హీరో కన్ఫర్మ్ అయిన సినిమా నుంచి ఆ హీరో ఎగ్జిట్ అవగా మరో హీరో ఆ సినిమాలో నటిస్తాడు. ఇదే క్రమంలో చిరంజీవి కోసం అనుకున్న ఓ సినిమా కాస్త ఆయన కాదన్నాక రాజశేఖర్ కు ఛాన్స్ వచ్చింది.

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన న్యాయం కోసం సినిమాలో రాజశేఖర్ నటించాడు. కానీ అసలు ఆ సినిమాలో చిరంజీవి నటించాల్సి ఉంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒరు సీబీఐ డైరీ కురిప్పు అనే సినిమానే తెలుగులో రీమేక్ చేశారు. అందులో సీబీఐ ఆఫీసర్ పాత్ర రాజశేఖర్ చేయగా ఆ పాత్రకు ముందు చిరంజీవిని అనుకున్నారట.

మలయాళ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమాను గీతా ఆర్ట్స్ రీమేక్ రైట్స్ కొనేశారు. అయితే ఇందులో సీబీఐ అధికారు పాత్రని ముందు చిరంజీవి తో చేయించాలని అల్లు అరవింద్ అనుకోగా అప్పటికే వేరే సినిమాల కమిట్ మెంట్ ఉండటం వల్ల చిరు ఆ సినిమా కాదన్నారు. అయితే తన ప్లేస్ లో ఆ పాత్రకు రాజశేఖర్ అయితే పర్ఫెక్ట్ అని రిఫర్ చేశారట చిరు. అలా చిరు చేయాల్సిన న్యాయం కావాలి సినిమాలో రాజశేఖర్ నటించారు.

ఆ సినిమా చూసిన రాజశేఖర్ కూడా ముందు చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుసుకుని లక్కీ పర్సన్ అనుకున్నారట. కానీ తిరిగి తిరిగి ఆ ఆఫర్ రాజశేఖర్ కి రావడంతో అంతమంచి క్యారెక్టర్ తనకు ఇచ్చినందుకు థాంక్స్ అని రాజశేఖర్ చెప్పారట. సో చిరు కాల్షీట్ లు లేకపోవడం వల్ల న్యాయం కావాలి సినిమా ఆఫర్ రాజశేఖర్ కి వచ్చింది. ఆ సినిమాతో రాజశేఖర్ సూపర్ హిట్ అందుకున్నారు.

అప్పటికే సీరియస్ కథలను చేస్తూ వస్తున్న రాజశేఖర్ న్యాయం కావాలి సినిమా సక్సెస్ మరింత బూస్టింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే రాజశేఖర్ రీమేక్ చేయాలని అనుకున్న రమణని తెలుగులో చిరు ఠాగూర్ గా చేశారు. ఆ సినిమా రిలీజ్ టైం లో చిరంజీవి మీద రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తపరచిన విషయం తెలిసిందే.