Begin typing your search above and press return to search.

బ‌న్నీ కోసం జ‌డేజా కూడా త‌గ్గేదేలే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   26 May 2024 11:30 PM GMT
బ‌న్నీ కోసం జ‌డేజా కూడా త‌గ్గేదేలే!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జాతీయ ఉత్త‌మ న‌టుడిగాను ఆ పాత్ర నిలిపిందంటేనే? న‌టుడిగా బ‌న్నీ ఎంత ప‌రిణితి చెందాడు? అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఈ సినిమాతో సరికొత్త బ‌న్నీని వెండితెర‌పై ఆవిష్క‌రించాడు. బ‌న్నీలో ఇంత గొప్ప న‌టుడు ఉన్నాడా? అని అంతా స్ట‌న్ అయ్యేలా చేసాడు. సుకుమార్ లాంటి గ్రేట్ డైరెక్ట‌ర్ తోడ‌వ్వ‌డంతోనే బ‌న్నీ అంత గొప్ప పెర్పార్మెన్స్ ఇవ్వ‌గ‌లిగాడు. ఈ సినిమాతో పాన్ ఇండియాలో బ‌న్నీకొచ్చిన గుర్తింపు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇంకా చెప్పాలంటే అత‌డి ఇమేజ్ పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ కే చేరింద‌నొచ్చు. అత‌డి పాత్ర స‌హా డాన్సు ప్ర‌తీది రీల్స్ రూపంలో వైర‌ల్ అవ్వ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. అలాంటి బ‌న్నీకి నేను అభిమాని అంటూ ఆల్ రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా ముందుకొచ్చాడు. `పుష్ప సినిమాతో త‌ర్వాత బ‌న్నీకి విరాభిమానిగా మారి పోయాన్నాడు. బ‌న్నీ లుక్ కాపీ కొట్టేశా. ఆ లుక్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తే బ‌న్నీ వాటికి రిప్లై ఇవ్వ‌డం నాకు బాగా న‌చ్చింది.

ఆ సినిమా హిందీలో చూసాను. కానీ తెలుగు డైలాగులే బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఆ డైలాగుల‌తో చాలా రీల్స్ చేసా. ఖాళీ దొరికితే అల్లు అర్జున్ న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస పెట్టి చూసేస్తా. ఒక్కో సినిమాకి అత‌డి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ చూసి ఆశ్చ‌ర్య‌మేసింది. ప్ర‌స్తుతం అంద‌రి ప్రేక్ష‌కుల్లానే నేను పుష్ప‌-2 రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. నేరుగా థియేట‌ర్లోనే ఆసినిమా చూస్తాను. ఆ క్ష‌నాణాలు ఎప్పుడ‌స్తాయా అని నాలో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతుంది` అని అన్నాడు.

మొత్తానికి బ‌న్నీ ..జ‌డేజాని కూడా త‌న అభిమానిగా మార్చేసుకున్నాడు. తెలుగు హీరోలంతా పాన్ ఇండియాలో కనెక్ట్ అవ్వ‌డంతో క్రికెట‌ర్ల‌కు అభిమాన హీరోలుగా మారిపోతున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి విరాట్ కోహ్లీ కూడా పెద్ద అభిమాని. అలాగే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఎం.ఎస్ ధోనీ కూడా అభిమానే. న‌టుడిగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగానూ ర‌జ‌నీని ఎంతో ఇష్ట‌ప‌డే క్రీకారుడు ధోనీ.