Begin typing your search above and press return to search.

సుకుమార్ ఆఫర్ రిజెక్ట్ చేయక తప్పలేదు

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో రవికృష్ణ ఇంటెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. లవ్ మీ చిత్రం కోసం పుష్ప 2లో ఛాన్స్ ని మిస్ చేసుకున్నానని చెప్పాడు.

By:  Tupaki Desk   |   25 May 2024 7:30 AM GMT
సుకుమార్ ఆఫర్ రిజెక్ట్ చేయక తప్పలేదు
X

సీరియల్ లో స్టార్ యాక్టర్ గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవికృష్ణ. అయితే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని మంచి ఫామ్ లో ఉన్న దశలో బుల్లితెరకి రవికృష్ణ దూరమయ్యాడు. మెల్లగా సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు పెంచుకుంటూ రవికృష్ణ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసిన రవికృష్ణ టాప్ కంటిస్టెంట్ లలో ఒకడిగా నిలిచాడు.

బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక సీరియల్స్ పూర్తిగా పక్కన పెట్టాడు. అనుభవించురాజా సినిమాలో రవికృష్ణ మొదటి అవకాశం అందుకున్నాడు. విరూపాక్ష సినిమాలో విలన్ పాత్రలో మెప్పించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రంలో నటించాడు. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న లవ్ మీ సినిమాలో కీలక పాత్రలో రవికృష్ణ నటించాడు.

ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో రవికృష్ణ ఇంటెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. లవ్ మీ చిత్రం కోసం పుష్ప 2లో ఛాన్స్ ని మిస్ చేసుకున్నానని చెప్పాడు. ఆ చిత్రంలో ఓ క్యారెక్టర్ సుకుమార్ టీమ్ తనని సంప్రదించారని, అయితే లవ్ మీ కోసం కేటాయించిన డేట్స్ తో క్లాస్ రావడంతో వదులుకున్న అని రవికృష్ణ తెలిపాడు.

పుష్ప 2 మూవీ ఛాన్స్ మిస్ కావడంతో చాలా ఫీల్ అయ్యాను. అయితే లవ్ మీ మూవీతో మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ నాకు ఇచ్చింది. కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా ఈ సినిమా నిలిచిపోతుందని మాటిచ్చారు. నాకు మూవీపైన చాలా నమ్మకం ఉంది. నా మీద నమ్మకంతో ఇలాంటి బెస్ట్ రోల్ ని ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకి థాంక్స్ చెబుతున్న అని రవికృష్ణ పేర్కొన్నారు.

విరూపాక్ష సినిమాతో అతని సినిమా కెరియర్ కి ఎలాంటి డోకా లేకుండా పోయింది. ఇప్పుడు లవ్ మీ సక్సెస్ అయితే కచ్చితంగా మరిన్ని మంచి అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ కావడం కూడా రవికృష్ణకి కెరియర్ పరంగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. లవ్ మీ చిత్రంలో అతని పాత్ర ఎలా ఉంటుందనేది చిత్ర యూనిట్ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచడం విశేషం.