Begin typing your search above and press return to search.

ఆ యాక్టర్ ను కన్నతండ్రి చంపాలనుకున్నాడా..?

తండ్రి వల్ల 17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చిన రవి కిషన్ అప్పటి నుంచి అవకాశాల కోసం ప్రయత్నించానని అన్నారు.

By:  Tupaki Desk   |   16 March 2024 11:30 PM GMT
ఆ యాక్టర్ ను కన్నతండ్రి చంపాలనుకున్నాడా..?
X

రవి కిషన్ ఈ యాక్టర్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు కానీ రేసుగుర్రం సినిమాలో శివా రెడ్డి అంటే మాత్రం అందరు కనెక్ట్ అవుతారు. భోజ్ పురి నటుడైన ఆయన తెలుగులో రేసుగుర్రం తో ఎంట్రీ ఇవ్వగా భోజ్ పురి, హిందీ, మరాఠి, కన్నడ సినిమాల్లో నటించారు. రేసుగుర్రం సినిమా తో సూపర్ పాపులర్ అయిన రవి కిషన్ తెలుగులో వరుస ఛాన్సులు అందుకున్నారు. రేసుగుర్రం తర్వాత రవితేజ కిక్ 2, సాయి ధరం తేజ్ తో సుప్రీమ్‌, శర్వానంద్ రాధ, నితిన్ లై, బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం, వరుణ్ తేజ్ గద్దలకొండ గణేశ్‌, కార్తికేయ 90ML‌, చిరంజీవితో కలిసి సైరా సినిమాల్లో నటించారు.

రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన నటుడిగా తన కెరీర్ ఎలా మొదలైందో వెల్లడించారు. తండ్రి వల్ల 17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చిన రవి కిషన్ అప్పటి నుంచి అవకాశాల కోసం ప్రయత్నించానని అన్నారు. నాన్నకు ఎమోషన్స్ తక్కువ.. అందుకే తనను బాగా కొట్టేవారు. ఒక దశలో తనను చంపాలనుకున్నాడు.. ఆ విషయం అమ్మకు అర్ధమై తనని పారిపొమ్మని చెప్పిందని అన్నారు రవి కిషన్.

ఐదు వందలతో ఇంటి నుంచి వచ్చిన ఆయన ట్రైన్ ఎక్కి ముంబై చేరుకున్నారట. అయితే నాన్న కోపంలో అర్థముంది. సంప్రదాయ కుటుంబం లో పుట్టిన తాను వ్యవసాయం లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయమన్నారు. తన కుటుంబంలో ఒక నటుడు పుడతాడని ఎప్పుడు ఊహించలేదు. ఆ టైం లోనే ఇంటి దగ్గర రామ్ లీల నాటకం వేయగా తను సీతగా నటించా.. అది నచ్చని నాన్న బాగా కొట్టారని ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చారు రవి కిషన్.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని తనకు కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు తప్పలేదని. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నటుడిగా సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఈ భూమీద నుంచి వెళ్లేప్పుడు మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యా.. ఆ ఆశ, ఆశయంతోనే నటుడిగా మారానని అన్నారు రవికిషన్. అయితే చిన్నతనంలో నాన్న నన్ను కొట్టినందుకు చివరి రోజుల్లో బాధ పడ్డారు. నువ్వే మాకు గర్వ కారణమని ఆయన బాధ పడ్డారని రవి కిషన్ చెప్పారు.