Begin typing your search above and press return to search.

టిల్లు గాడి డైలాగ్స్.. అతని హ్యాండ్ క్లిక్కయ్యింది!

డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   31 March 2024 11:49 AM GMT
టిల్లు గాడి డైలాగ్స్.. అతని హ్యాండ్ క్లిక్కయ్యింది!
X

డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతోంది. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే మొదటి రోజు ఏకంగా 25 కోట్లకి పైగా గ్రాస్ ని టిల్లు స్క్వేర్ కలెక్ట్ చేసింది. దీనిని బట్టి సినిమాకి ఎలాంటి ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు. డీజే టిల్లు తరహాలోనే టిల్లు స్క్వేర్ లో సింగిల్ లైనర్ కామెడీ డైలాగ్స్ సినిమాలో బాగా సౌండ్ చేశాయి.

ఆడియన్స్ కి ఆ డైలాగ్స్ బాగా వినోదాన్ని అందించాయి. టిల్లు క్యారెక్టర్ లిల్లీ చేతిలో మోసపోయిన తర్వాత తనపై తాను పేల్చుకున్న డైలాగ్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ ని యూత్ ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. సినిమాలో డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, వాటిని టిల్లు పాత్రలో సిద్దు డిఫరెంట్ మాడ్యులేషన్ తో చెప్పిన విధానం కూడా అంతే అద్భుతంగా ఉంది.

ఈ సినిమాకి కథ అందించింది సిద్దు జొన్నలగడ్డ అని అందరికి తెలిసిందే. అలాగే డైలాగ్స్ కూడా అతనే రాసాడు. సిద్దుతో పాటు ఈ డైలాగ్స్ రైటింగ్ కోసం ఇంకో రైటర్ కూడా సపోర్ట్ చేసాడంట. అతని పేరు రవి ఆంటోనీ. టిల్లు స్క్వేర్ చూసిన తర్వాత అతని పేరు గట్టిగానే వినిపిస్తోంది. రవి ఆంటోనీ రైటర్ గా ఎవరికి పరిచయం లేదు. కానీ యాక్టర్ గా ఇప్పటికే ఒక సినిమాలో కనిపించాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే వచ్చిన మ్యాడ్ మూవీ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఈ సినిమాలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ట్యూబ్ లైట్ పట్టుకొని తిరిగే ఆంటోనీ క్యారెక్టర్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ పాత్రలో నటించిన వాడే ఈ రవి ఆంటోనీ. డీజే టిల్లుకి స్క్రిప్ట్ తో పాటు డైలాగ్స్ పరంగా సిద్దు రవి ఆంటోనీతో కలిసి రాశాడు. టైటిల్ కార్డ్స్ లో రవి ఆంటోనీ పేరు కూడా పడింది. దీంతో ఇప్పుడు రైటర్ గా రవి ఆంటోనీ పేరు టాలీవుడ్ సర్కిల్ లో గట్టిగా వినిపిస్తోంది.

టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతూ ఉండటంతో నెక్స్ట్ రాబోయే టిల్లు క్యూబ్ పై ఆడియన్స్ ఫోకస్ వెళ్ళింది. ఆ మూవీ కోసం ఎలాంటి కథని ఎంపిక చేసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే రవి ఆంటోనీ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.