మొత్తానికి రాజా జనాలకి అలవాటు చేసేసాడలా!
ఒకే పని పదే పదే చేస్తే అలవాటుగా మారుతుంది. తలెత్తిన నెగిటివిటీ కూడా తొలగిపోతుంది.
By: Tupaki Desk | 5 Aug 2025 6:00 AM ISTఒకే పని పదే పదే చేస్తే అలవాటుగా మారుతుంది. తలెత్తిన నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. దాని గురించి మళ్లీ ఎక్కడా చర్చకు దారి తీయదు. ఎందుకంటే అప్పటికే అలవాటుగా మారిపోతుంది కాబట్టి. ఇప్పు డదే జరిగింది మాస్ రాజా రవితేజ విషయంలో? ఇంతకీ ఏంటా నెగిటివిటీ? అంతగా చేయకూడని పనేం చేసాడు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఏ హీరోకైనా హీరోయిన్ ఎంపికన్నది సమతూకంగా ఉండాలి. 50 ఏళ్ల నటుడైతే 30 ఏళ్ల వయసున్న నాయిక అయితే బ్యాలెన్స్ అవుతుంది. 60 దాటిందంటే కనీసం 40 ఏళ్లు అయినా ఆ హీరోయిన్ కి ఉండాలి.
వయసుతో పనేంటి?
కానీ ఇది అన్ని వేళలా సాధ్యపడదు. కొన్ని సందర్బాల్లో 20-25 ఏళ్ల నాయికను ఎంపిక చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ వయసు 18 ఏళ్లకు కూడా వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ ఊహతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నెగిటివిటీ వ్యక్తమవుతుంది. ఆ మధ్య మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన `ధమాకా` సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటికే రవితేజ వయసు 55 ఏళ్లు కాగా శ్రీలీల కు 22 ఏళ్లు. దీంతో తండ్రి వయసున్న రవితేజతో శ్రీలీల రొమాన్స్ చేస్తుం దా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేచింది.
ఇప్పుడా సంగతి అంతటా లైట్
ఇక్కడ టార్గెట్ అయింది రవితేజ. పుండు మీద కారం చల్లినట్లు పదే పదే ఆ కామెంట్ ని తెరపైకి తెచ్చారు సెక్షన్ ఆడియన్స్. కానీ మాస్ రాజా ఆ విమర్శల్ని ఎంత మాత్రం పట్టించుకోలేదు. మీ పని మీది నా పని నాది అన్న తీరులో ముందుకెళ్లాడు. తాజాగా అదే కాంబినేషన్ లో మళ్లీ `మాస్ జాతర` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ ఇద్దరి వయసులు రెండేళ్లు మాత్రమే పెరిగాయి. ఇప్పుడెలాంటి కామెంట్లు రాలేదు. విమర్శలు వ్యక్తమవ్వలేదు. సోషల్ మీడియా జనాలు ఆ అంశాన్నే మరిచారు.
ఆ హీరోకి తప్పలేదు తిప్పలు
రవితేజ కూడా ఎలాంటి కామెంట్లను పట్టించుకునే రకం కాదు. తన పని తప్ప ఇంకెలాంటి నెగివిటీని తీసుకోని స్వభావం గలవారు. ఏదైనా పాత బడే కొద్ది దాన్ని మర్చిపోవడం అన్నది పరిపాటే. ఇలాంటి వ్యతిరేకతనే రణవీర్ సింగ్ కూడా ఈ మధ్యనే ఎదుర్కున్నారు. `దురంధర్` లో రణవీర్ కు జోడీగా సారా అర్జున్ నటిస్తోంది. సారా వయసు 20 ఏళ్లు కాగా రణవీర్ సింగ్ ఏజ్ 40 ఏళ్లు. ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. జనాలంతా రణవీర్ ని దుమ్మెత్తి పోసారు. బాలీ వుడ్ మీడియాలో ప్రత్యేక కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
