Begin typing your search above and press return to search.

ఇదే ప్లానింగ్ మాస్ రాజా.. కొడుకు కూతురు ఇద్దరినీ..!

స్టార్ హీరో తనయుడు సినీ తెరంగేట్రం అన్నది కామన్. ఐతే మాస్ మహారాజ్ మాత్రం తన వారసులను డిఫరెంట్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   29 Nov 2025 2:32 PM IST
ఇదే ప్లానింగ్ మాస్ రాజా.. కొడుకు కూతురు ఇద్దరినీ..!
X

స్టార్ హీరో తనయుడు సినీ తెరంగేట్రం అన్నది కామన్. ఐతే మాస్ మహారాజ్ మాత్రం తన వారసులను డిఫరెంట్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఆల్రెడీ మహాధన్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో డెబ్యూ ఇచ్చాడు. ఆ సినిమాలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసేలా మాస్ రాజా ఫ్యాన్స్ ని మెప్పించాడు. ఐతే ఆ సినిమా తర్వాత సినిమాను టెక్నికల్ గా అర్థం చేసుకునేందుకు ADగా అదే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు మహాధన్. ఆల్రెడీ వెంకీ అట్లూరి సూర్య కాంబినేషన్ సినిమాకు మహధాన్ పనిచేస్తున్నాడు.

మహధాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా..

రీసెంట్ గా సందీప్ వంగ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు కూడా మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడట. సో తనయుడిని కూడా తన బాటలోనే ముందు సినిమాను అర్థం చేసుకుని తర్వాత ఎంట్రీ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాడు రవితేజ. ఐతే మహాధన్ హీరోగా చేస్తాడా లేదా డైరెక్టర్ గా కొనసాగుతాడా అన్నది మాత్రం కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది.

ఇక రవితేజ తనయుడే కాదు కూతురు మోక్షధ కూడా సినిమాల్లోకి వస్తుంది. ఐతే ఆమె నిర్మాతగా తన సత్తా చాటాలని చూస్తుంది. అందుకే రవితేజ బ్యానర్ బాధ్యతలను దగ్గర ఉండి చూసుకుంటుంది. త్వరలో రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోక్షధ వ్యవహరిస్తుందట. సో రవితేజ సినిమాలకు మోక్షధ ఎగ్జిక్యూటివ్ గా కొనసాగే ఛాన్స్ కనిపిస్తుంది.

తనకు లైఫ్ ఇచ్చిన సినిమాల్లోనే.. తన లైఫ్ అయిన తనయుడు, తనయురాలు..

ఇలా నిర్మాణంలో కొంత ఎక్స్ పీరియన్స్ వచ్చాక సొంతంగా సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. మొత్తానికి తనకు లైఫ్ ఇచ్చిన సినిమాల్లోనే తన లైఫ్ అయిన తనయుడు మహాధన్, తనయురాలు మోక్షధ లను కూడా తీసుకొచ్చారు రవితేజ. ఐతే సినిమాల మీద వారికి ఆసక్తి ఉండటం వల్లే ఎలాంటి ఫోర్స్ లేకుండా రవితేజ వారిని వారికి ఆసక్తి ఉన్న విభాగాల్లో ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఐతే మహాధన్ డైరెక్టర్ ఏంటి మాస్ రాజా లెగసీని కొనసాగించాలి కదా హీరోగా ఎప్పుడు మారతాడని ఫ్యాన్స్ ఇప్పటికే హడావిడి చేయడం మొదలు పెట్టారు.

రవితేజ ప్లానింగ్ ఏంటో కానీ మహాధన్ సందీప్ వంగ, వెంకీ అట్లూరి లాంటి డైరెక్టర్స్ దగ్గర పనిచేయడంతో అతను కూడా మంచి సినిమా ఎక్స్ పీరియన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. రవితేజ సినిమాల విషయానికి వస్తే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భక్తమహాశయులకు విజ్ఞప్తి సినిమా చేస్తున్న రవితేజ ఆ మూవీతో సంక్రాంతి బరిలోకి వస్తున్నారు. నెక్స్ట్ శివ నిర్వాణతో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్లానింగ్ ఉంది.