Begin typing your search above and press return to search.

ఒక హీరోతో ఆరుగురు హీరోయిన్లు.. ఇది అసలు నిజం!

మాస్ మహారాజా స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో రెండు ప్రాజెక్టులు లైన్లో పెడుతుంటారు.

By:  Tupaki Desk   |   2 Dec 2025 12:33 PM IST
ఒక హీరోతో ఆరుగురు హీరోయిన్లు.. ఇది అసలు నిజం!
X

మాస్ మహారాజా స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో రెండు ప్రాజెక్టులు లైన్లో పెడుతుంటారు. అయితే ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన వార్త కొద్ది గంటలుగా చక్కర్లు కొట్టింది. ఇది విన్న వారంతా షాక్ అయ్యారు. ఒక సీనియర్ హీరో సినిమా కోసం ఇంత మంది భామలు క్యూ కట్టారా అని ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల మీమ్స్, డిస్కషన్స్ కూడా గట్టిగానే నడిచాయి.

సీనియర్ హీరోలకు జోడీని సెట్ చేయడం మేకర్స్ కు ప్రస్తుతం పెద్ద టాస్క్ గా మారింది. అలాంటిది రవితేజ కొత్త సినిమాలో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఒక్కరు దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో, ఏకంగా అరడజను మందితో రవితేజ రొమాన్స్ చేయబోతున్నారనే టాక్ వినిపించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ వేరే లెవల్ లో ఉంటుందని, మాస్ రాజా రికార్డు సృష్టిస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బయట జరుగుతున్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదట. ఆరుగురు హీరోయిన్లు అనేది పూర్తిగా అవాస్తవం అని తేలిపోయింది. ఎవరో పనిగట్టుకుని పుట్టించిన పుకారు తప్ప, ఇందులో వాస్తవం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వార్త వినడానికి క్రేజీగా ఉన్నా, ప్రాక్టికల్ గా అలాంటి ప్రాజెక్ట్ ఏదీ పట్టాలెక్కడం లేదు.

ఈ రూమర్ ఎంతలా వైరల్ అయ్యిందంటే, చివరికి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రవితేజ తర్వాతి ప్రాజెక్ట్ లో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారనే వార్తలో వాస్తవం లేదని, ఆ ప్రచారం అంతా 'ఫేక్' అని మాస్ రాజా సన్నిహితులు తేల్చి చెప్పేశారు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, స్ప్రెడ్ చేయవద్దని కోరారు. కథ డిమాండ్ మేరకు కాస్టింగ్ ఉంటుంది తప్ప, కేవలం గ్లామర్ కోసం ఇంతమందిని తీసుకోవడం లేదని అర్థమవుతోంది.

ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పై ఫోకస్ పెట్టారు. ఈ సినిమాల షూటింగ్ లో రవితేజ బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో ఇలాంటి గాసిప్స్ రావడం చూసి హీరో కూడా నవ్వుకుని ఉంటారు. కాబట్టి ఫ్యాన్స్ ఈ ఆరుగురు భామల గోల గురించి ఆలోచించడం మానేసి, అఫీషియల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం మంచిది. అనవసరపు హైప్ క్రియేట్ చేసుకుని తర్వాత డిజప్పాయింట్ అవ్వడం కంటే, మేకర్స్ చెప్పే వరకు ఆగడమే బెటర్.