రవితేజ లైన్ అప్ లో సూపర్ హీరో కథ!
మాస్ మహారాజా రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో వరుసగా ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ దూసుకెళ్తున్నారు.
By: Tupaki Desk | 3 Jun 2025 6:00 AM ISTమాస్ మహారాజా రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో వరుసగా ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మాస్ జాతర సినిమాతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా మరో పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్టు సమాచారం. ఇది సూపర్ హీరో నేపథ్యంతో ఉండబోతోందన్న టాక్ సినిమావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా కథను చాలాకాలంగా సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రం కోసం రవితేజ, యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో కలిసి చేయబోతున్నారు. కళ్యాణ్ శంకర్ ఇప్పటికే మ్యాడ్ సీరీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతను రవితేజకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ సూపర్ హీరో పాత్రతో తన టాలెంట్‌ను మరోసారి నిరూపించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఈ మూవీని నిర్మించబోయేది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.
ఇది కేవలం ఒకే సినిమాగా కాకుండా.. పూర్తి సూపర్ హీరో ఫ్రాంచైజీగా ప్లాన్ అవుతుందట. మొదటి పార్ట్ విజయం సాధిస్తే మరో రెండు భాగాలు కూడా తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ఇందులో రవితేజ పాత్రలో కొన్ని అద్భుతమైన శక్తులు ఉండనున్నాయని, విఎఫ్ఎక్స్ స్థాయిలో చాలా వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్టు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారట. కథ, కాన్సెప్ట్, టెక్నికల్ విలువలతో పాటు మాస్ మహారాజా పవర్‌ని కలిపే ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడూ చూడని స్టైల్‌లో రవితేజ కనిపించబోతున్నాడని యూనిట్ లో టాక్. మరి ఈ కాన్సెప్ట్ పై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
ఇక మరోవైపు రవితేజ మాస్ జాతర సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. సమ్మర్ మొదట్లోనే రావాల్సిన ఈ సినిమా మధ్యలో రవితేజ గాయం కారణంగా కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడు విడుదల డేట్ ను ఫైనల్ చేయడంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే రవితేజ మరో రెండు కథలను కూడా లైన్ లో పెట్టినట్లు టాక్.
