రవితేజ మూవీకి డిఫరెంట్ టైటిల్
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తాడనే విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 31 May 2025 10:49 AM ISTహిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తాడనే విషయం తెలిసిందే. అయితే గత కొన్ని సినిమాలుగా రవితేజకు సరైన హిట్టు పడలేదు. ధమాకా తర్వాత మాస్ మహారాజా చాలా సినిమాలు చేసినప్పటికీ అవన్నీ అతనికి నిరాశనే మిగిల్చాయి. దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు రవితేజ.
అందులో భాగంగానే రవితేజ తన తర్వాతి సినిమాను భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మాస్ జాతర టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయడంలో రవితేజ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 27న మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రానుంది.
మాస్ జాతర సినిమా తర్వాత రవితేజ తన తర్వాతి సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ లో ఈ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ కానుంది. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. రవితేజ స్టెల్లర్ పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని చెప్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. రవితేజ- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు అనార్కలి అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. అయితే రవితేజ సినిమా టైటిల్స్ ఎప్పుడూ క్యాచీగా ఉంటూ మాస్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు మొదటిసారి అనార్కలి లాంటి టైటిల్ ను పరిశీలించడం చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంది. ప్రస్తుతానికైతే అనార్కలి అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమేనంటున్నారు. తర్వాత టైటిల్ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
