మాస్ జాతర పై నాగ వంశీ స్పెషల్ కేర్!
అయితే ఇప్పుడలాంటి సమస్యే మాస్ మహారాజా రవితేజ సినిమాకొచ్చింది. రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర సినిమా వాస్తవానికి ఆగస్ట్ 27న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడా ఆ సినిమా రావడం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Aug 2025 1:00 PM ISTఈ మధ్య రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోయింది. ముందు ఓ డేట్ ను చెప్పడం, తర్వాత ఆ డేట్ కు షూటింగ్ పూర్తవకపోవడంతో మరో డేట్ కు దాన్ని వాయిదా వేయడం, అప్పటికీ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల సినిమాను పలమార్లు వాయిదా వేస్తున్నారు మేకర్స్. దీంతో ఒకే సినిమా పలుమార్లు వాయిదా పడటంతో ప్రేక్షకులకు సినిమాపై ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది.
అయితే ఇప్పటిలా ఒకప్పుడు సినిమాలు వాయిదా పడేవి కావు. దానికి కారణం అప్పట్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా అనౌన్స్‌మెంట్ తోనే రిలీజ్ ఎప్పుడనేది కూడా చెప్పడంతో డైరెక్టర్ కు రిలీజ్ డేట్ టార్గెట్ ను రీచ్ అవడమనేది పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ఒత్తిడిలో అనుకోకుండా కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి.
సెప్టెంబర్ రిలీజ్ కష్టమే!
అయితే ఇప్పుడలాంటి సమస్యే మాస్ మహారాజా రవితేజ సినిమాకొచ్చింది. రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర సినిమా వాస్తవానికి ఆగస్ట్ 27న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడా ఆ సినిమా రావడం లేదు. సెప్టెంబర్ 12న రిలీజవుతుందన్నారు కానీ సెప్టెంబర్ లో కూడా మాస్ జాతర రావడం కుదరని పని అని తెలుస్తోంది.
మాస్ జాతరకు పెండింగ్ షూట్
ఆల్రెడీ పూర్తైన సినిమాను చూసిన టీమ్, సినిమాకు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అవసరమని, అందుకే కొన్ని సీన్స్ ను షూట్ చేయాలని భావించిందట. దాని కోసమే రవితేజ, శ్రీలీలతో పాటూ మరికొందరి డేట్స్ కూడా అవసరమయ్యాయని పెండింగ్ షూట్ ఫినిష్ అయ్యేవరకు మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
నష్టాల్లో నిర్మాణ సంస్థ
అసలే కింగ్‌డమ్, వార్2 సినిమాలతో సితార సంస్థకు భారీ నష్టాలు రావడంతో నెక్ట్స్ మూవీ తో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరముంది. అందుకే నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమా బాలేకపోతే దాన్ని ఆడియన్స్ ఏ విధంగా ట్రోల్ చేస్తారో బాగా తెలిసిన నాగవంశీ ఈ సారి ఆడియన్స్ కు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ రీషూట్లకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
