Begin typing your search above and press return to search.

మాసు.. క్లాసు.. కలిస్తే ఏమవుతుందో..?

రవితేజ తన తర్వాత సినిమాను కిశోర్ తిరుమల డైరెక్షన్ లో లాక్ చేసుకున్నాడు. కిశోర్ తిరుమల సినిమాలు అన్నీ కూడా క్లాస్ ఎంటర్టైనర్స్ గా వచ్చాయి.

By:  Tupaki Desk   |   1 Jun 2025 2:00 AM IST
మాసు.. క్లాసు.. కలిస్తే ఏమవుతుందో..?
X

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. భాను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ధమాకా సూపర్ హిట్ కాగా మళ్లీ ఆ హిట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. మాస్ జాతర సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఐతే రవితేజ నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో నడుస్తుంది.

రవితేజ తన తర్వాత సినిమాను కిశోర్ తిరుమల డైరెక్షన్ లో లాక్ చేసుకున్నాడు. కిశోర్ తిరుమల సినిమాలు అన్నీ కూడా క్లాస్ ఎంటర్టైనర్స్ గా వచ్చాయి. ఆయన సినిమా వస్తుంది అంటే ఏజ్ లిమిట్ అనేదే లేకుండా అందరు చూడదగ్గ సినిమా అని చెబుతుంటారు. చివరగా శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేసిన కిశోర్ తిరుమల నెక్స్ట్ మరో ప్రయత్నం చేయలేదు. క్లాస్ డైరెక్టర్ గా పేరున్న కిశోర్ ఈసారి మాస్ హీరోతో సినిమా లాక్ చేసుకున్నాడు.

మాస్ హీరో క్లాస్ డైరెక్టర్ ఈ కాంబినేషన్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. అనార్కలి టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఇద్దరు అందాల భామలు అది కూడా యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న కయదు లోహార్, మమితా బైజులు నటిస్తున్నారని తెలుస్తుంది. రవితేజ మాస్ ఫాలోయింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం అదిరిపోయే బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. కానీ ఈమధ్య ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎనర్జీని వేస్ట్ చేస్తూ వచ్చాయి.

ఫైనల్ గా మాస్ జాతరతో మళ్లీ రవితేజ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. ఇక నెక్స్ట్ కిశోర్ తిరుమల సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. మరి రవితేజ తో కిశోర్ ఎలాంటి సినిమా చేస్తాడు.. ఆ సినిమాతో ఎలాంటి హంగామా సృష్టిస్తారు అన్నది చూడాలి. రవితేజ కూడా ఇక మీద చేసే సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారట. ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా సినిమాను రిజెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. మరి మాస్ రాజాలో ఈ మార్పు ఆయన కెరీర్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.