Begin typing your search above and press return to search.

జెట్ స్పీడ్ లోనే రవితేజ న్యూ కాంబో!

మాస్ మహారాజ్ రవితేజ ఎప్పుడూ కూడా వైవిధ్యమైన కథలతో అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తాడు.

By:  Tupaki Desk   |   7 May 2025 6:18 AM
Ravi Teja Gears Up for Mass Comeback with Next Movie
X

మాస్ మహారాజ్ రవితేజ ఎప్పుడూ కూడా వైవిధ్యమైన కథలతో అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తాడు. ‘క్రాక్’, ‘ధమాకా’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ, తన స్టైల్‌లో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో బాక్సాఫీస్ షేక్ చేశాడు. కానీ, ఈ మధ్య కొన్ని సినిమాలు అతని ఇమేజ్‌కు తగ్గట్టుగా లేకపోవడంతో డిజాస్టర్స్‌గా మిగిలాయి.

‘రావనసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో రవితేజ తన కొత్త సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో రవితేజ మళ్లీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మాస్ జాతర సినిమా తర్వాత రవితేజ కొత్త ప్రాజెక్ట్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రవితేజ కిషోర్ తిరుమలతో ఓ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ జూన్ 3, 2025 నుంచి మొదలవుతుందని టాక్. ఈ ప్రాజెక్టుని కూడా మాస్ రాజా జెట్ స్పెస్ లోనే ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక ‘చిత్రలహరి’, ‘రెడ్’ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల, ఈ సినిమాలో రవితేజతో ఓ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ కాంబో అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనుందని అంటున్నారు.

సినిమా కథ వివరాలు ఇంకా బయటకు రాలేదు, కానీ ఇది రవితేజ స్టైల్‌లో మాస్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుందని టాక్. ఈ సినిమా కోసం రవితేజ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని, కిషోర్ తిరుమల అతని ఎనర్జీని సరైన విధంగా వాడుకునేలా స్క్రిప్ట్ రెడీ చేశాడని సమాచారం. ఈ సినిమా రవితేజ ఇమేజ్‌ను మళ్లీ బూస్ట్ చేసే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా, రవితేజ గత డిజాస్టర్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.